బుల్లితెరపై చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకుని, ప్రేక్షకులపై తనదైన ముద్రను వేసిన నటుడు రాజీవ్ ఖండేల్వాల్. బాలీవుడ్‌లో ఎక్కువ అవకాశాల కోసమే తాను బుల్లితెరను వీడాల్సి వచ్చిందని చెబుతున్నాడు. కహీతో హోగాతో టెలివిజన్‌కు పరిచయమైన రాజీవ్ అంతకుముందు ఎల్‌ఎంఎల్, గ్రీన్‌లేబుల్ విస్కీ, కొడాక్ ఎక్స్‌ప్రెస్, వీడియోకాన్ రిఫ్రిజిరేటర్స్ ప్రకటనల్లోనూ కనిపించాడు. 10 ఏళ్ల పాటు టెలివిజన్ పరిశ్రమలో కొనసాగిన రాజీవ్ టైజం డ్రామాతో రూపొందిన ‘ఆమిర్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తరువాత షైతాన్‌లో ఇన్‌స్పెక్టర్ అరవింద్ మాథుర్ పాత్ర పోషించాడు. టేబుల్ నంబర్ 21లో వివాన్ అగస్తీగా కనిపించి మెప్పించాడు. ‘‘ఆమిర్ అవకాశం వచ్చినప్పుడు నేను మరేమీ ఆలోచించలేదు. కారణం నా ఆలోచనల్లో ఉన్న స్క్రిప్ట్ నా ముందుకొచ్చింది. అందుకే వినగానే ఓకే చెప్పాను. మొదటి సినిమాలో ఏ లవర్ బోయ్ పాత్రనో చేయకుండా, భిన్నమైన పాత్ర పోషించడం నాకు నచ్చింది’’ అంటున్నాడు. రాజ్‌శ్రీ బ్యానర్ నిర్మిస్తున్న డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమా సామ్రాట్ అండ్ కో రాజీవ్ తాజా సినిమా.
ఇది కుటుంబ కథా చిత్రాలకు భిన్నంగా ఉంటుందని చెబుతున్నాడు. ఇందులో ఇతడు డిటెక్టివ్‌గా కనిపిస్తాడు. హాలీవుడ్, బాలీవుడ్ గూఢచార చిత్రాల్లో లాగా నేల విడిచి సాము చేయకుండా, కథ వాస్తవానికి దగ్గరగా ఉంటుందని చెబుతున్నాడు. ‘‘నా పాత్ర శక్తివంతమైనదే. అయితే బాలీవుడ్ సినిమాల్లో మాదిరిగా భవనాల మీద నుంచి దూకడం వంటి గిమ్మిక్కులు మాత్రం ఉండవు. తెలివి, లాజిక్ తోనే ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాను’’ అని అంటున్నాడు. 2008లోనే బాలీవుడ్‌కి వచ్చినా ఇతడు ఎక్కువ చిత్రాలు చేయలేదు. ఏడాదికి రెండు, మూడు చిత్రాలు చేస్తే చాలని పరేష్ రావల్ వంటి తన శ్రేయోభిలాషులు సూచిస్తున్నారని చెబుతున్నాడు. రాజీవ్ ఖండేల్వాల్ రాబోయే చిత్రం ఫీవర్. దీని షూటింగ్ స్విట్జర్లాండ్‌లో కొనసాగుతోంది.
సినిమా కోసమే టీవీకి దూరం..
Published Sat, Apr 26 2014 10:38 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement