ఫేస్‌బుక్‌లో నగ్న ఫొటోలు.. క్విట్‌ అయిన నటి | Kavita Kaushik Quits Facebook And Writes Her Last Post | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 30 2018 7:09 PM | Last Updated on Thu, Aug 30 2018 7:30 PM

Kavita Kaushik Quits Facebook And Writes Her Last Post - Sakshi

ఇలాంటి ఫొటోలు పెట్టి తన పరువును బజారుకీడ్చే దిగజారుడు చర్యలకు పూనుకుంటారని ఊహించలేక పోయానని ఆమె వాపోయారు.

సాక్షి, ముంబై : ప్రముఖ హిందీ నటి కవిత కౌశిక్‌ ఫేస్‌బుక్‌పై మండిపడ్డారు. పనికిమాలిన పనులు చేసేందుకు తప్ప ఫేస్‌బుక్‌ దేనికీ పనికిరాదని దుమ్మెత్తి పోశారు. ఫేస్‌బుక్‌లో దర్శనమిచ్చిన తన మార్ఫింగ్‌ నగ్నఫొటోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌ నుంచి తప్పుకున్నారు. సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి వాడుతున్న ఫేస్‌బుక్‌ నుంచి ఎప్పుడో క్విట్‌ అవుదామనుకున్నానని చెప్పారు. ఇలాంటి ఫొటోలు పెట్టి కొందరు తన పరువును బజారుకీడ్చే దిగజారుడు చర్యలకు పూనుకుంటారని ఊహించలేక పోయానని వాపోయారు. అందుకనే క్విట్‌ అవుతున్నాననీ, సోషల్‌ మీడియాకు దూరంగా ఉందామనుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ఉద్ధరించొద్దు..!
‘పక్కనే ఉండే స్నేహితులు ఎక్కడో ఉండే అపరిచిత వ్యక్తులతో వాదులాడుకోవడం.. మన సహోద్యోగులు ఏదో ఉద్ధరిస్తామంటూ దేశాన్నేలే నేతల గురించి తెగ ఇదై పోవడం.. ఇదంతా మన విలువైన సమయాన్ని ఫేస్‌బుక్‌కు కట్టబెట్టడమేన’ని కవిత అభిప్రాయపడ్డారు. సోషల్‌ మీడియా చేస్తున్న చేటును, తన అభిప్రాయాలను ఆమె వెల్లడించారు. మనందరి కాలాన్ని హరించే రాక్షసి ఈ ఫేస్‌బుక్‌ అని పేర్కొన్నారు. ఈ ఫేస్‌బుక్‌లో కుళ్లు రాజకీయాలు విడిచిపెట్టి కావాలంటే తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. తగిన ఆతిథ్యంతో పాటు పనికొచ్చే విషయమేదైనా సరే కాసేపు మాట్లాడుకుందామని వ్యాఖ్యానించారు. పక్కనోడితే పలకరింపులు లేకుండా చేస్తున్ నఫేస్‌బుక్‌కు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. 

కాగా, ఫేక్‌బుక్‌ విత్‌ కవితా, కుటుంబ్‌, కహానీ ఘర్‌ ఘర్‌ హై, తుమ్హారీ దిశా, రీమిక్స్‌, సీఐడీ, ఎఫ్‌ఐఆర్‌, ఏక్‌ ప్యారా సా బందన్‌, సావ్‌దాన్‌ వంటి సీరియళ్లలో నటించి కవిత మంచి పేరు తెచ్చుకున్నారు. ఏక్‌ హసీనా థి, ముంబై కటింగ్‌, ఫిలిం సిటీ, జంజీర్‌ వంటి చిత్రాల్లో కూడా నటించారు. ఆమె రోనిత్‌ బిస్వాస్‌ను పెళ్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement