
గొడవలు లేకుండా బిగ్‌బాస్ షోను ఊహించుకోవడం కష్టం. కానీ ఆ గొడవలు శ్రుతిమించితేనే మరీ కష్టం. హిందీ బిగ్‌బాస్ పద్నాలుగో సీజన్ గొడవలకు నిలయంగా మారింది. కంటెస్టెంట్లు చీటికీమాటికీ, అయినదానికీ కానిదానికీ తగవు పడుతూనే ఉన్నారు. తాజాగా నటి కవితా కౌశిక్, రుబీనా మధ్య గొడవ రాజుకుంది. 'నీ భర్త గురించి ఓ నిజం తెలుసా?' అని కవిత రుబీనాను భయపెట్టేందుకు ప్రయత్నించగా.. నీకంత ధైర్యం ఉంటే చెప్పు అని రుబీనా సమాధానం ఇచ్చింది. దీంతో కవితా ఇప్పుడు కాదు, ఈ హౌస్ బయటకు వెళ్లాక గుట్టు విప్పుతానని వార్నింగ్ ఇచ్చింది. (చదవండి: మోనాల్‌తో మాట్లాడమని అభికి చెప్పేవాళ్లం: లాస్య)
ఈ క్రమంలో ఇద్దరూ.. నువ్వంటే నువ్వు నోరు మూసుకోమంటూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. రుబీనా భర్త అభినవ్ శుక్లా అక్కడే ఉన్నప్పటికీ వీరి గొడవలో తలదూర్చాలనుకోలేదు. అటు వీరి ప్రవర్తనతో బిగ్‌బాస్‌కు కూడా చిర్రెత్తినట్లుంది. ఇంటి నిబంధనలను పాటించడం ఇష్టం లేకపోతే తక్షణమే వెళ్లిపోవచ్చని హౌస్ గేట్లు తెరిచాడు. దీంతో ఆవేశంతో ఊగిపోతున్న కవిత మరేం ఆలోచించకుండా ప్రధాన ద్వారం నుంచి బయటకు వెళ్లింది. దీంతో హౌస్‌మేట్లు ఒక్కసారిగా షాకయ్యారు. మరి కవిత తిరిగి లోపలకు వస్తుందా? లేక ఆమె షో నుంచి శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నట్లేనా అన్నది తెలియాలంటే నేటి హిందీ బిగ్‌బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే! (చదవండి: ఆ బిగ్‌బాస్ కంటెస్టెంటు నా భార్య, మోసం చేసింది)
Comments
Please login to add a commentAdd a comment