భారతీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ సీఈ (BMW CE) లాంచ్ అయింది. దీని ధర రూ. 14.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ధరలను బట్టి చూస్తే ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ టూ వీలర్ అదే అని తెలుస్తోంది.
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 130 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 2.3 kW ఛార్జర్ ద్వారా 4 గంటల 20 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ అవుతుంది. 6.9 kW ఛార్జర్ ద్వారా 1 గంట 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.
సీఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్లోని మోటారు 42 హార్స్ పవర్, 62 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ 2.6 సెకన్లలో 0 నుంచి 50 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ 120 కిమీ.
ఎల్ఈడీ లైటింగ్స్, 10.25 ఇంచెస్ TFT డిస్‌ప్లే, కీలెస్ ఇగ్నిషన్, ట్రాక్షన్ కంట్రోల్, USB ఛార్జర్, సైడ్-మౌంటెడ్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ వంటివి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పొందుతుంది. ఇది బ్లూ, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఎకో, రెయిన్, రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment