ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత్‌లో న్యూ వెర్షన్ బైక్‌ను విడుదల చేసింది. 1000ఆర్‌ఆర్ పేరుతో లాంచ్ చేసిన బైక్ ప్రారంభ ధర రూ.49 లక్షలుగా ఉంది. అప్‌డేట్ చేసిన ఎం 1000 ఆర్‌ఆర్‌ను సైతం వాహనదారులకు పరిచయం చేసింది. దీని ధర రూ.49లక్షలుగా ఉంది. ఎం 1000 ఆర్‌ఆర్ కాంపిటీషన్ పేరిట తీసుకొచ్చిన మరో బైక్ ధర రూ.55 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
ఈ వేరియంట్‌లో బ్లాక్‌స్ట్రోమ్ మెటాలిక్ అండ్ ఎం మోటార్‌స్పోర్ట్స్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ సూపర్ బైక్‌లో లిక్విడ్ కూల్డ్ 999సీసీ, ఇన్‌లైన్ 4 సిలిండర్ ఇంజిన్, 212హెచ్‌పీ, 113 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. కేవలం 3.1 సెకన్లలో 0-100 కేపీఎంహెచ్ స్పీడ్ అందుకోగలదు. అయితే, టాప్ స్పీడ్ 314కేపీఎంహెచ్ వరకు దూసుకెళ్లగలదు.
కంప్లీట్ బిల్ట్ అప్ యూనిట్ (సీబీయూ) తో వస్తున్న ఈ బైక్ ప్రీ ఆర్డర్లు అన్ని బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా అథరైజ్డ్ డీలర్ల వద్ద జూన్ 28 నుంచి ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. 2023 నవంబర్ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment