సక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పింది. జూబ్లీహిల్స్ నుంచి ఫిలింనగర్ రామానాయుడు స్టూడియో మీదుగా బీఎండబ్ల్యూ కారు అతి వేగంగా ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో రామానాయుడు స్టూడియో వద్ద ఉన్న మూలమలుపు వద్ద ఒక్కసారిగా కారు బొల్తా కొట్టింది. కారు దీంతో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులోని నాలుగు బెలూన్లు తెరుచుకోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు ముందుభాగం బాగా దెబ్బతింది.
చదవండి: సైబర్ మోసాలకు గురయ్యారా.. ఈ నంబర్‌కు కాల్ చేయండి!
కాగా ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న అర్మన్‌కు గాయాలవ్వగా అతన్ని స్థానికులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కారు మూడు రోజుల కిందటే కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కేవలం 947 కిలో మీటర్ల దూరమే ఈ కారు తిరిగింది. ప్రమాదం నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫక్‌ను క్లియర్ చేశారు.
చదవండి: పంజాగుట్ట: మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు.. యువతులు, నిర్వాహకుల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment