ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్‌షా తండ్రి, శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) నేత రాజేష్ షాపై పార్టీ చర్యలు చేపట్టింది. పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ బుధవారం ప్రకటించింది. కాగా పాల్ఘర్ జిల్లాకు చెందిన శివసేన నేత రాజేష్ షా ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదల అయ్యారు.
ఆయన కుమారుడు మిహిర్ ఆదివారం ఉదయం మద్యం మత్తులో కారు నడుపుతూ వర్లీ ప్రాంతంలో బైక్‌ను ఢీకొట్టడంతో కావేరీ నఖ్వా అనే మహిళ చనిపోగా ఆమె భర్త గాయపడటం తెలిసిందే. ప్రమాదం జరిగినప్పటి నుంచి మూడు రోజులుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మిహిర్‌ను ముంబైలోని విరార్ వద్ద మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతని తల్లి, ఇద్దరు చెల్లెళ్లను మరో 10 మందితో కలిసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే పోలీసుల విచారణలో.. ప్రమాద సమయంలో తాను బీఎండబ్లయూ కారు నడుపుతున్నట్లు మిహిర్ అంగీకరించాడు. కానీ తాను తాగినట్లు వచ్చిన ఆరోపణలనుఅతడు కొట్టేసినట్లు తెలుస్తోంది.
పోలీసుల విచారణలో ప్రమాదం ముందు మిహిర్ తన స్నేహితులతో కలిసి వైస్ గ్లోబల్ తపాస్ బార్‌లో మద్యం తాగి బిల్ ఏకంగా 18 వేలు చేసినట్లు తేలింది.మిహిర్ తొలుత మహిళను ఢీకొన్న తర్వాత ఆమెను 1.5 కిలోమీటర్లు ఈడ్చుకు వెళ్లాడు .తర్వాత వాహనం టైరులో చిక్కుకున్న ఆమెను రోడ్డుపై పడేశాడు.
కారును రివర్స్ చేసేటప్పుడు ఆమెపై నుంచి మరోసారి కారును ఎక్కించాడు. ఇక మిహిర్‌కు మద్యం సరఫరా చేసన బార్ యజమానిని అరెస్ట్ చేయడంతోపాటు బార్‌ను మూసేశారు. మిహిర్ తండ్రిని, స్నేహితులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment