పూణే కారు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్‌ | Supriya Sule Attacked Maharashtra Government Over Car Accident | Sakshi
Sakshi News home page

Pune Porsche Accident: షిండే సర్కార్‌ కుటుంబాలను చీల్చడంతో బిజీగా ఉందా?: సుప్రియా సూలే ఫైర్‌

Published Fri, May 24 2024 7:55 AM | Last Updated on Fri, May 24 2024 11:01 AM

Supriya Sule Attacked Maharashtra Government Over Car Accident

పూణే: పుణేలో విలాసవంతమైన పోర్షే కారు ప్రమాదం కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఊహించని ట్విస్ట్‌ బయటకు వచ్చింది. కారు ప్రమాదానికి గురైన సమయంలో కారు నడిపింది తన కొడుకు కాదని.. కారును నడిపింది తమ డ్రైవర్‌ అని మైనర్‌ బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దీంతో, ఈ కేసు మరో మలుపు తిరిగింది.

కాగా, పూణేలో ఓ మైనర్‌ మద్యం మత్తులో ఫుల్‌ స్పీడ్‌లో పోర్షే కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. కాగా, పోర్శే కారును మైనర్‌(17) నడిపాడని ఇప్పటివరకు పోలీసులు భావించారు. అతడిపైనే కేసు నమోదైంది. ప్రస్తుతం జువైనైల్‌ సెంటర్‌కు మైనర్‌ను తరలించారు. కాగా, ఈ ప్రమాదం జరిగినప్పుడు కారును నడిపింది తమ డ్రైవర్‌ అని మైనర్‌ బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

 

 

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న మైనర్‌ బాలుడి స్నేహితులు ఇద్దరు కూడా కారును డ్రైవరే నడిపాడని తెలిపారు. ప్రమాద సమయంలో తానే కారును నడిపానని డ్రైవర్‌ కూడా పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. అయితే, కేసు నుంచి మైనర్‌ను తప్పించేందుకే డ్రైవర్‌ను ఇరికిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు.. నిందితుడు వేదాంత్‌ అగర్వాల్‌ కన్నీరు పెడుతున్న వీడియో కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నిందితుడి తల్లి శివానీ అగర్వాల్‌ స్పందించారు. ఈ సందర్భంగా తన కుమారుడిని రక్షించాలని కన్నీరుపెట్టుకున్నారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఇది ఫేక్‌ వీడియో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


 

 

ఇక, ఈ ఘటనపై ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే మాట్లాడుతూ.. మైన‌ర్‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేయ‌డంతో పుణేలో డ్రంకెన్ డ్రైవ్ కార‌ణంగా ఘోర ప్ర‌మాదం జరిగింది. డ్ర‌గ్స్ స్వాధీనం, మైన‌ర్ల‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రాలు, డ్రంకెన్ డ్రైవ్ జ‌రుగుతుంటే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఏం చేస్తోంది. పోలీసులపై ఒత్తిడి తెస్తున్నది ఎవరు?. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం రాజ‌కీయ పార్టీల‌ను, కుటుంబాల‌ను చీల్చ‌డంలో నిమ‌గ్న‌మైంద‌ని విమ‌ర్శించారు. పుణే ఘ‌ట‌న‌కు బాధ్యులు ఎవ‌ర‌ని ఏక్‌నాథ్ షిండే స‌ర్కార్‌ను ఆమె ప్ర‌శ్నించారు. దీంతో, ఆ ఘటన రాజకీయంగా కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement