BMW Electric Scooter Ce04 Price In India, Features, Mileage, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

బిఎమ్‌డబ్ల్యు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Published Mon, Nov 22 2021 6:19 PM | Last Updated on Tue, Nov 23 2021 8:41 AM

BMW Motorrad starts CE04 electric scooter production - Sakshi

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యు తన మొదటి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను మార్కెట్లోకి తీసుకొని రావడానికి గత కొంతకాలంగా పనిచేస్తోంది. జర్మన్ ప్రీమియం టూ వీలర్ కంపెనీ ఈ ఏడాది జూలైలో తన తొలి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ సీఈ-04ను అధికారికంగా లాంచ్ చేసింది. బిఎమ్‌డబ్ల్యు సీఈ-04 ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తుంది. సైన్స్ ఫిక్షన్ సినిమాల నుంచి ప్రేరణ పొందిన ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా ఇది కనిపిస్తుంది. జీరో-ఎమిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన పనితీరు, కళ్లు చెదిరే డిజైన్‌తో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. బిఎమ్‌డబ్ల్యు సీఈ-04 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ యమహా ఎక్స్ మ్యాక్స్, బిఎమ్‌డబ్ల్యు సి400 మొదలైన పెట్రోల్ వాహనాల లాగా కనిపిస్తుంది. ఈ స్కూటర్ 42 హెచ్‌పి పవర్ అవుట్ పుట్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. ఈ ప్రీమియం స్కూటర్ మూడు సెకన్ల కంటే తక్కువ సమయంలోనే 0-50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది అని సంస్థ తెలిపింది. దీనిలో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, కనెక్టివిటీ ఫీచర్లు, ఫుల్ ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్ ఫుల్ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది.

(చదవండి: నెట్‌ప్లిక్స్‌ వినియోగిస్తున్నారా..! అయితే ఇది మీ కోసమే..!)

బిఎమ్‌డబ్ల్యు సీఈ-04 ప్రీమియం స్కూటర్ 2022 ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లోకి రానుంది. ఈ స్కూటర్ బేస్ మోడల్ ధర సుమారు $11,795(సుమారు రూ.8.8 లక్షలు)గా ఉండనుంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 120-150 కిమీ దూరం వెళ్లనుంది. అలాగే, దీనిని సాధారణ చార్జర్ సహాయంతో 3-4 గంటలు, ఫాస్ట్ చార్జర్ సహాయంతో 30 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూట‌ర్‌ను భారతీయ మార్కెట్లోకి తీసుకువస్తారా లేదా అనే విషయంపై ఇంకా కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.

(చదవండి: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్​పై స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల దండయాత్ర!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement