స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. గత మూడు నాలుగేళ్లలో దర్శకుడిగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా తీయని ఇతడు.. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా ఓ మూవీ తీస్తున్నారు. ఇది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అది అలా ఉండగా ఇప్పుడు ఓ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అలానే ఈ ఖరు ధర తెలిసి అందరూ షాకవుతున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. అక్కడ మాత్రం ఇంకా పెండింగ్‌లోనే)
స్టాలిన్, గజిని, తుపాకీ, కత్తి లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో యమ క్రేజ్ తెచ్చుకున్న మురుగదాస్.. 2020లో రజనీకాంత్‌తో 'దర్బార్' మూవీ తీశాడు. అది ఘోరంగా ఫెయిల్ కావడంతో పూర్తిగా డైరెక్షన్ పక్కనబెట్టేశాడు. నిర్మాతగా రెండు సినిమాలు తీశాడు అవి కూడా ఏమంత పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో అలరించలేకపోయాయి. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇది ఈ ఏడాది రిలీజ్ కావొచ్చు.
ఇకపోతే తాజాగా దాదాపు రూ.1.30 కోట్ల విలువ చేసే బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7 (BMW X7) కారుని కొనుగోలు చేశాడు. షోరూంలో మురుగదాస్ ఫ్యామిలీ అంతా కలిసి తీసుకున్న పిక్స్ వైరల్ అయ్యాయి. అదే టైంలో ఈ కారు ఏకంగా రూ.కోటి కంటే ఎక్కువ కాస్ట్ అని తెలిసి షాకవుతున్నారు. దర్శకుడిగా ఫామ్‌లో లేనప్పటికీ కాస్ట్ లీ కారు కొన్నాడని మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'గుంటూరు కారం'.. అదే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?)
Comments
Please login to add a commentAdd a comment