జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత విపణిలో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ సెడాన్ ఐ5 మోడల్‌ను తాజాగా తన వినియోగదారులకు పరిచయం చేసింది. సెడాన్ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన కార్లలో తొలి ఎలక్ట్రిక్ మోడల్ ఇదేనని కంపెనీ వర్గాలు తెలిపాయి.
సింగిల్ ఛార్జింగ్‌తో 516 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు ధర రూ.1.20 కోట్లుగా నిర్ణయించినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. కేవలం 3.8 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెప్పింది.
ఇది గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిసింది. 83.9కిలోవాల్ హవర్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ కారు కేవలం అరగంటలోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ అవనుంది.
Comments
Please login to add a commentAdd a comment