హీరోయిన్ కీర్తి సురేశ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహానటి సినిమాతో ఎంతో స్టార్‌డమ్ సంపాదించుకుంది. ఇందులో ఆమె సావిత్రిగా కనిపించి అందరి మన్నన్నలు అందుకుంది. ఇప్పటికీ ఆమె కీర్తిగా కంటే కూడా మహానటి అని పిలుస్తుంటారు. అయితే ఆ స్టార్‌డమ్‌ను కీర్తి కొనసాగించలేకపోతోంది. ఇటీవల ఆమె నటించిన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు సరసన సర్కారు వారి పాట మూవీతో ఎన్నో ఫ్లాప్‌ల అనంతరం సక్సెస్ అందుకుంది.
చదవండి: నటి దివ్య కేసులో కొత్త ట్విస్ట్, ఆమె కంటే ముందు ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమ, పెళ్లి
ఇదిలా ఉంటే ఈ మధ్య సన్నబడ్డ కీర్తి సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన లేటెస్ ఫొటోలు షేర్ చేస్తు ఫ్యాన్స్ అలరిస్తోంది. ఇక ఆడపదడపా సినిమాలు చేస్తూ వస్తున కీర్తి ఇటీవల లగ్జరీ కారు కొనుగోలు చేసింది. దసరా పండగ సందర్భంగా కీర్తి లగ్జరీ బీఎండబ్య్లూ కారు ఖరీదు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీఎండబ్ల్యూలో కొత్త మోడల్ ఎక్స్7 సిరీస్ తీసుకుంది.
చదవండి: మా నాన్నలో నాకు నచ్చనిది అదే: మంచు విష్ణు
అయితే ఇప్పటికే ఆమె పలు లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ కార్లపై ఉన్న మక్కువతో బీఎండబ్య్లూ(BMW X7 Luxury SUV) కొత్త మోడల్ సిరీస్‌ను తన కార్ల గ్యారేజ్‌లో చేర్చింది. బీఎండబ్ల్యూ ఎక్స్7 సిరీస్ బ్లూ కలర్ కారు చాలా రాయల్‌గా కనిపిస్తోంది. ఈ కారు ధర రూ. 1.18 కోట్ల నుండి రూ. 1.80 కోట్ల వరకు ఉంటుందని అంచన. 7 సీటర్ కార్లలో బీఎండబ్ల్యూనే బాగా ప్రాచుర్యం పొందింది. దీనిలో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త iDrive సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రిస్టల్-ఎఫెక్ట్ గేర్ లివర్, వాయిస్ అసిస్టెంట్ వంటి అత్యాధునిక ఫీచర్స్ ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment