హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా.. కొత్త 3 సిరీస్ గ్రాన్ లిమజిన్ మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.57.9 లక్షల నుంచి ప్రారంభం. 2 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌తో డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 6.2 సెకన్లలో, డీజిల్ వేరియంట్ 7.6 సెకన్లలో అందుకుంటుంది.
దేశీయ మార్కెట్లో BMW 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్ అనేది లాంగ్ వీల్ బేస్ కలిగి రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. ఒకటి 330Li పెట్రోల్, రెండోది 320Ld డీజిల్ వేరియంట్స్. కొత్త బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్‌తో కస్టమర్లకు అందుబాటులో ఉంది.
ఇందులోని 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 190 hp పవర్, 400 Nm టార్క్ అందిస్తుంది. ఇక 2.0 పెట్రోల్ ఇంజిన్ 258 hp పవర్, 400 Nm టార్క్ అందిస్తుంది. ఇది 15.39 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. దేశీయంగా ఈ కారును తయారు చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.
చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు!
Comments
Please login to add a commentAdd a comment