
స్మార్ట్‌ఫోన్ కంపెనీలు లగ్జరీ కార్లకు డిజిటల్ కీలు రూపొందించే పనిలో పడ్డాయి. యాపిల్ సంస్థ ఇలాంటి కార్ కీ ఫీచర్‌ను 2020లోనే ప్రకటించింది. ఆ తర్వాత ఒప్పో, వన్‌ప్లస్, వివోలు కూడా కొన్ని రోజుల క్రితం డిజిటల్ కీలను విడుదల చేశాయి. తాజాగా షావోమీ ప్రీమియం లగ్జరీ బీఎండబ్ల్యూ కార్లకు డిజిటల్ కీ రూపొందిస్తున్నట్లు ప్రకటించింది.
ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో షావోమీ 13 సిరీస్ ప్రకటన సందర్భంగా ఆ కంపెనీ అధికార ప్రతినిధి ఈ మేరకు ప్రకటించారు. ఎంపిక చేసిన బీఎండబ్ల్యూ మోడళ్లకు డిజిటల్ కీలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: వన్ ప్లస్ 11 కాన్సెప్ట్ ఫోన్ ఫస్ట్ లుక్.. లిక్విడ్ కూలింగ్ ఫీచర్ అదుర్స్!)
ఈ డిజిటల్ కీలను కార్లను లాక్, అన్‌లాక్‌తో పాటు స్టార్ట్ కూడా చేయొచ్చు. ముఖ్యంగా కారును వేరొకరికి ఇచ్చినప్పుడు ఈ డిజిటల్ కీ బాగా ఉపయోగపడుతుంది. వారికి అసలైన కీ ఇవ్వాల్సిన పని లేకుండా కేవలం డిజిటల్ కీని మొబైల్ ద్వారా షేర్ చేయొచ్చు. ఈ డిజిటల్ కీని గూగుల్ వాలెట్ వంటి వాటితో అనుసంధానించనున్నారు.
(ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?)
Comments
Please login to add a commentAdd a comment