జర్మన్ లగ్జరీ కారు బ్రాండ్ బీఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ కూపర్, భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన ఎలక్ట్రిక్ కార్లు అప్పుడే పూర్తిగా అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. మినీ కూపర్ ఇండియా దేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అయిన 'మినీ ఎలక్ట్రిక్' కోసం అక్టోబర్ 29న అధికారికంగా బుకింగ్ ఓపెన్ చేసింది. ప్రారంభ ఆఫర్ కింద తీసుకొచ్చిన 30 కార్లు మొత్తం బుక్ అయినట్లు సంస్థ పేర్కొంది. లక్ష రూపాయలతో బుకింగ్ ఓపెన్ చేసినట్లు తెలిపింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మినీ కూపర్ ఎస్ఈ 32.6కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ చేత పని చేస్తుంది.ఈ కారు 181 బిహెచ్పీ పవర్, 270ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఈ మోడల్ 7.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 150 కి.మీ. డబ్ల్యుఎల్ టీపీ ప్రకారం.. కూపర్ ఎస్ఈను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 270 కిలోమీటర్ల వెళ్లగలదు అని కంపెనీ తెలిపింది. ఈ కారు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడిడిఆర్ఎల్ ఓవల్ హెడ్ ల్యాంప్, షడ్భుజి ఆకారంలో ఉండే గ్రిల్, కాంట్రాస్ట్ కలర్ ఓఆర్ విఎమ్ లతో వస్తుంది. ఈ కారు లోపల 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనుంది.
కస్టమర్లు మినీ కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ కారుని 11కెడబ్ల్యు(2.5 గంటలు) లేదా 50కెడబ్ల్యు ఛార్జర్ తో ఛార్జ్ చేయవచ్చు. ఇది బ్యాటరీని 35 నిమిషాల్లో 0-80 శాతం నుంచి ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా ఆ తర్వాతి నెలల్లో డెలివరీ చేసే అవకాశం ఉంది. మినీ ఇండియా ఈ ఆల్-ఎలక్ట్రిక్ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారతదేశానికి దిగుమతి చేసుకుని విక్రయిస్తుంది.
(చదవండి: దేశీయ ఈవీ మార్కెట్లో చైనా కారు విడుదల.. రేంజ్ ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment