Mini Cooper
-
చిన్న కారులో 29 మంది.. ‘ఇంకెంత మందిని ఎక్కించేస్తార్రా బాబు’
చిన్న కారులో ఎంత మంది పడతారు... డ్రైవర్‌తో కలిపి ఐదుగురు. బాగా సర్దుకుంటే.. మహా అయితే ఏడెనిమిది మంది కూర్చోవచ్చు. కానీ, 29 మందిని కారులో ఎక్కించారు. కాదు కాదు.. ఏకంగా కుక్కేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ రికార్డు పాతదే అయినా... ఆ వీడియోను ఆన్లైన్లో ఇటీవలే విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోకు... ‘సాధారణ మినీకూపర్లో ఎంత మంది వలంటీర్లను కుక్కేయొచ్చు?’ అని ట్యాగ్ చేశారు. బస్తాల మాదిరిగా ఒకరి తరువాత ఒకరిని తోస్తూ, చివరికి కారు డిక్కీలోనూ కొంతమందిని ఫిక్స్చేసి... ఇంకెంత మందిని ఎక్కించేస్తార్రా బాబు అనిపించారు. దీనిపై నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరో ఒకరి తల పగిలేదాకా ఇది సరదాగా, ఆటలాగే ఉంటుందని ఒకరు, ఇంతమందినీ ఒకే కారులో కుక్కి ఏం సందేశం ఇవ్వాలను కుంటున్నారు? దీంతో లాభమేంటి? అని ఇంకొకరు... ప్రశ్నలు గుప్పిస్తున్నారు. చదవండి: జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు..వైరలవుతోన్న వీడియో -
ఈవీ మార్కెట్లోకి మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ కూడా సూపర్..!
Mini Cooper Electric India Launch On 24 February: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యు తన మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుకు సిద్దం అయ్యింది. గత ఏడాది డిసెంబర్ నెలలో బీఎమ్‌డబ్ల్యు ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యువిని లాంఛ్ చేసిన తర్వాత మినీ కూపర్ ఎస్ఈ త్రీ డోర్ ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో లాంఛ్ చేయనుంది. ఈ మినీ కూపర్ ఎస్ఈ కారుని 2022 ఫిబ్రవరి 24న భారతదేశంలో విడుదల చేయనున్నారు. దీని కోసం ప్రీ బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. మొదటి బ్యాచ్‌లో 30 యూనిట్ల కార్లు కూడా ఇప్పటికే అమ్ముడుపోయాయి.కొత్త మినీ కూపర్ ఎస్ఈని ప్రపంచవ్యాప్తంగా 2019లో ఆవిష్కరించారు. ఈ ఎలక్ట్రిక్ కారు పెట్రోల్ వెర్షన్ కంటే 145 కిలోల బరువుగా ఉంది. కొత్త మినీ కూపర్ ఎస్ఈ 32.6 కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ చేత పనిచేస్తుంది. ఇది 182 హెచ్‌పీ పవర్, 270 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 7.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 150 కి.మీ. డబ్ల్యుఎల్ టీపీ ప్రకారం.. కూపర్ ఎస్ఈను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 270 కిలోమీటర్ల వెళ్లగలదు అని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కారును 11కెడబ్ల్యు ఛార్జర్ సహాయంతో 2.5 గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేస్తే, అయితే 50కెడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 35 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడిడిఆర్ఎల్ ఓవల్ హెడ్ ల్యాంప్, షడ్భుజి ఆకారంలో ఉండే గ్రిల్, కాంట్రాస్ట్ కలర్ ఓఆర్ విఎమ్ లతో వస్తుంది. ఈ కారు లోపల 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనుంది. ఇప్పుడు బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా ఆ తర్వాతి నెలల్లో డెలివరీ చేసే అవకాశం ఉంది. మినీ ఇండియా ఈ ఆల్-ఎలక్ట్రిక్ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారతదేశానికి దిగుమతి చేసుకుని విక్రయిస్తుంది. (చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు) -
ఈవీ ప్రియులకు పండగే.. 2022లో రాబోతున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
దేశంలో రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల ఆసక్తిని గమనించిన కంపెనీలు వారికి తగ్గట్టు సరికొత్త ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అనేక రకాల ఎలక్ట్రిక్ కార్లు రోడ్డు మీద చక్కర్లు కొడుతున్నప్పటికి, వచ్చే ఏడాది 2022లో దిగ్గజ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసేందుకు సిద్దం అవుతున్నాయి. 2022లో ఎలక్ట్రిక్ కారు తయారీ కంపెనీలు తీసుకొనిరాబోతున్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ టెస్లా కంపెనీకి పోటీ ఇచ్చేందుకు ఈక్యూఎస్ అనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొని రాబోతుంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారు ఎడ్మండ్స్ చేసిన రియల్ వరల్డ్ రేంజ్ టెస్టులో 422 మైళ్ల దూరం ప్రయాణించింది. టెస్లా ఉత్తమ మోడల్ కంటే దాదాపు 20 మైళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించింది అన్నామట. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 770 కిమీ వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ధర $102,310 (రూ.76,07,899) లుగా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది.ఈ కారుకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద 10-80 శాతం చేరుకోవడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీనిలో 107.8 kWh బ్యాటరీ సామర్ధ్యం గల ఇంజిన్ ఉంది. ఇది 2022 మొదటి త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది. (చదవండి: ఒమిక్రాన్ భయాలతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!) టెస్లా మోడల్ 3 & మోడల్ వై ఎలక్ట్రిక్ కారు ప్రియులు అందరూ ఈ ఏడాదిలో టెస్లా కారు విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. టెస్లా మోడల్ 3 సింగిల్, డ్యూయల్ మోటార్ సెటప్‌లతో ఉంటుంది. టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ పూర్తి ఛార్జీపై 423 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఈ కారు 6 సెకన్లలోపు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుతుంటుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ వేరియంట్ ఒకే పూర్తి ఛార్జీతో 568 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ వేరియంట్ కేవలం 3 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని ధర సుమారు రూ. 60 - 80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మోడల్ వై అనేది ఏడు సీట్ల వాహనం. అమెరికాలో దీని ధర 54,000 డాలర్ల(సుమారు 40 లక్షల రూపాయల) పై మాటే. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 326 కిమీ వరకు వెళ్లగలదు. దీని గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్లు. ఇది 4.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రెండు కూడా ఈ రెండవ త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది. (చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..!) వోల్వో XC40 రీఛార్జ్ వోల్వో మొట్ట మొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనం ఇదే. రాబోయే వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా వస్తుంది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ 408 బిహెచ్పి, 660 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని, ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ స్ప్రింట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఒకే ఛార్జీపై 418 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ భారత మార్కెట్లో ధృవీకరించబడిన సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ ప్రీమియం ఎస్యూవీ ఆఫర్. దీని ధర సుమారు రూ.50 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆడి క్యూ4 ఈ-ట్రాన్ జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి.. క్యూ4 ఈ-ట్రాన్ అనే ఎలక్ట్రిక్ కారును 2022లో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీజెనీవాలో జరుగుతున్న మోటార్ షోలో కంపెనీ ఈ కారు కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. క్యూ4 ఇ-ట్రాన్ ఒక 4 డోర్ ఎస్యూవీ. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. మాగ్జిమమ్ ఔట్పుట్ 302 బీహెచ్పీ. ఇందులో క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 6.3 సెకన్లలో అందుకుంటుంది. కారును ఒకసారి చార్జ్ చేస్తే 450 కిలోమీటర్లు వెళ్లొచ్చు. గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఈ కారు ధర సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చు. హ్యుందాయ్ అయోనిక్ 5 ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ వచ్చే ఏడాది అయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సిద్దం అవుతుంది. ఈ కారును కేవలం 5 నిమిషాల ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అయోనిక్ 5 కార్లు ప్రధానంగా 390 హెచ్‌పీ అవుట్ పుట్తో.. ఆల్ వీల్ డ్రైవ్ కార్ల రూపంలో చెలామణీలోకి వచ్చే అవకాశం ఉంది. 5 సెకన్లలో సున్నా నుంచి 100 కేఎంపీహెచ్ స్పీడును అందుకొనున్నాయి. పలు రిపోర్టుల ప్రకారం అయోనిక్ 5 కారును ఫుల్ ఛార్జ్ చేస్తే 450 కిలో మీటర్లు వరకు వెళ్లనుంది. దీని ధర సుమారు రూ- 25-30 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మినీ కూపర్ ఎస్ఈ జర్మన్ లగ్జరీ కారు బ్రాండ్ బీఎమ్డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ కూపర్, భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన ఎలక్ట్రిక్ కార్లు అప్పుడే పూర్తిగా అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మినీ కూపర్ ఎస్ఈ 32.6కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ చేత పని చేస్తుంది.ఈ కారు 181 బిహెచ్పీ పవర్, 270ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 7.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 150 కి.మీ. డబ్ల్యుఎల్ టీపీ ప్రకారం.. కూపర్ ఎస్ఈను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 270 కిలోమీటర్ల వెళ్లగలదు అని కంపెనీ తెలిపింది. ఈ కారు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడిడిఆర్ఎల్ ఓవల్ హెడ్ ల్యాంప్, షడ్భుజి ఆకారంలో ఉండే గ్రిల్, కాంట్రాస్ట్ కలర్ ఓఆర్ విఎమ్ లతో వస్తుంది. ఈ కారు లోపల 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనుంది. కస్టమర్లు మినీ కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ కారుని 11కెడబ్ల్యు(2.5 గంటలు) లేదా 50కెడబ్ల్యు ఛార్జర్ తో ఛార్జ్ చేయవచ్చు. ఇది బ్యాటరీని 35 నిమిషాల్లో 0-80 శాతం నుంచి ఛార్జ్ చేస్తుంది. ఈ కారు ధర సుమారు రూ.50 లక్షలు ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. (చదవండి: 2021 రౌండప్: అత్యంత చెత్త కంపెనీ ఏదంటే..) -
రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్లు
జర్మన్ లగ్జరీ కారు బ్రాండ్ బీఎమ్డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ కూపర్, భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన ఎలక్ట్రిక్ కార్లు అప్పుడే పూర్తిగా అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. మినీ కూపర్ ఇండియా దేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అయిన 'మినీ ఎలక్ట్రిక్' కోసం అక్టోబర్ 29న అధికారికంగా బుకింగ్ ఓపెన్ చేసింది. ప్రారంభ ఆఫర్ కింద తీసుకొచ్చిన 30 కార్లు మొత్తం బుక్ అయినట్లు సంస్థ పేర్కొంది. లక్ష రూపాయలతో బుకింగ్ ఓపెన్ చేసినట్లు తెలిపింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మినీ కూపర్ ఎస్ఈ 32.6కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ చేత పని చేస్తుంది.ఈ కారు 181 బిహెచ్పీ పవర్, 270ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 7.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 150 కి.మీ. డబ్ల్యుఎల్ టీపీ ప్రకారం.. కూపర్ ఎస్ఈను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 270 కిలోమీటర్ల వెళ్లగలదు అని కంపెనీ తెలిపింది. ఈ కారు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడిడిఆర్ఎల్ ఓవల్ హెడ్ ల్యాంప్, షడ్భుజి ఆకారంలో ఉండే గ్రిల్, కాంట్రాస్ట్ కలర్ ఓఆర్ విఎమ్ లతో వస్తుంది. ఈ కారు లోపల 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనుంది. కస్టమర్లు మినీ కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ కారుని 11కెడబ్ల్యు(2.5 గంటలు) లేదా 50కెడబ్ల్యు ఛార్జర్ తో ఛార్జ్ చేయవచ్చు. ఇది బ్యాటరీని 35 నిమిషాల్లో 0-80 శాతం నుంచి ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా ఆ తర్వాతి నెలల్లో డెలివరీ చేసే అవకాశం ఉంది. మినీ ఇండియా ఈ ఆల్-ఎలక్ట్రిక్ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారతదేశానికి దిగుమతి చేసుకుని విక్రయిస్తుంది. (చదవండి: దేశీయ ఈవీ మార్కెట్లో చైనా కారు విడుదల.. రేంజ్ ఎంతో తెలుసా?) -
అదిరిపోయిన బీఎండబ్ల్యూ ‘మినీ’ కార్లు..!
ముంబై: జర్మనీ విలాస కార్ల సంస్థ బీఎండబ్ల్యూ తన ‘మినీ బ్రాండ్’ నుంచి మంగళవారం మూడు కార్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఆల్-న్యూ మినీ 3-డోర్ హ్యాచ్ ధర రూ.38 లక్షలు, ఆల్-న్యూ మినీ కన్వర్టబుల్ ధర రూ.44 లక్షలు, ఆల్-న్యూ మినీ జాన్ కూపర్ వర్క్స్ హ్యాచ్ ధర రూ.45.5 లక్షలుగా ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్లలో లభ్యమయ్యే ఈ మినీ శ్రేణి కార్లు కంప్లీట్లీ బిల్ట్ అప్ యూనిట్ (సీబీయూ) రూపంలో భారత్‌లోకి దిగుమతి అవుతాయి. మినీ 3-డోర్ హ్యాచ్ 6.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇదే వేగాన్ని అందుకునేందుకు మినీ కన్వర్టబుల్ మోడల్‌కు 7.1 సెకన్ సమయం అవసరం. ఈ కార్లలో అధిక ధర కలిగిన మినీ జాన్ కాపర్ వర్క్స్ హ్యాచ్ 6.1 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మినీ 3-డోర్ హ్యాచ్, మినీ కన్వర్టబుల్ రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నాయి. చదవండి: BMW : మూడు సెకన్లలోనే అంత వేగమా -
బీఎండబ్ల్యూ మినిలో 3, 5 డోర్ల వేరియంట్లు
ముంబై: బీఎండబ్ల్యూ కంపెనీ మినీ మోడల్లో 3, 5 డోర్ల వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో, 11 రంగుల్లో ఈ కారు లభిస్తుందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సహర్ చెప్పారు. 3 డోర్ల మినీ కారు ధర రూ.31.85 లక్షలు, 5-డోర్ మినీ కారు ధర రూ.35.20 లక్షలని(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్) పేర్కొన్నారు. చిన్న కార్ల సెగ్మెంట్లో ఐదు డోర్ల కారును ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ఈ కారు 0-100 కి.మీ. వేగాన్ని 6.7 సెకన్లలో అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 244 కి.మీ. అని వివరించారు. మూడు డోర్ల మినీ కారు గరిష్ట వేగం గంటకు 200 కి.మీ. అని తెలిపారు. వచ్చే ఏడాది మిని కూపర్ ఎస్, కూపర్ ఎస్డీ వేరియంట్లను అందుబాటులోకి తెస్తామని వివరించారు.