
చిన్న కారులో ఎంత మంది పడతారు... డ్రైవర్‌తో కలిపి ఐదుగురు. బాగా సర్దుకుంటే.. మహా అయితే ఏడెనిమిది మంది కూర్చోవచ్చు. కానీ, 29 మందిని కారులో ఎక్కించారు. కాదు కాదు.. ఏకంగా కుక్కేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ రికార్డు పాతదే అయినా... ఆ వీడియోను ఆన్‌లైన్లో ఇటీవలే విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోకు... ‘సాధారణ మినీకూపర్‌లో ఎంత మంది వలంటీర్లను కుక్కేయొచ్చు?’ అని ట్యాగ్ చేశారు.
బస్తాల మాదిరిగా ఒకరి తరువాత ఒకరిని తోస్తూ, చివరికి కారు డిక్కీలోనూ కొంతమందిని ఫిక్స్‌చేసి... ఇంకెంత మందిని ఎక్కించేస్తార్రా బాబు అనిపించారు. దీనిపై నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరో ఒకరి తల పగిలేదాకా ఇది సరదాగా, ఆటలాగే ఉంటుందని ఒకరు, ఇంతమందినీ ఒకే కారులో కుక్కి ఏం సందేశం ఇవ్వాలను కుంటున్నారు? దీంతో లాభమేంటి? అని ఇంకొకరు... ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
చదవండి: జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు..వైరలవుతోన్న వీడియో
Comments
Please login to add a commentAdd a comment