అదిరిపోయిన బీఎండబ్ల్యూ ‘మినీ’ కార్లు..! | BMW Debuts 2021 MINI Range Of Cars In India | Sakshi
Sakshi News home page

అదిరిపోయిన బీఎండబ్ల్యూ ‘మినీ’ కార్లు..!

Published Wed, Jun 23 2021 10:29 PM | Last Updated on Wed, Jun 23 2021 10:33 PM

BMW Debuts 2021 MINI Range Of Cars In India - Sakshi

ముంబై: జర్మనీ విలాస కార్ల సంస్థ బీఎండబ్ల్యూ తన ‘మినీ బ్రాండ్‌’ నుంచి మంగళవారం మూడు కార్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఆల్‌-న్యూ మినీ 3-డోర్‌ హ్యాచ్‌ ధర రూ.38 లక్షలు, ఆల్‌-న్యూ మినీ కన్వర్టబుల్‌ ధర రూ.44 లక్షలు, ఆల్‌-న్యూ మినీ జాన్‌ కూపర్‌ వర్క్స్‌ హ్యాచ్‌ ధర రూ.45.5 లక్షలుగా ఉన్నాయి. పెట్రోల్‌ ఇంజిన్లలో లభ్యమయ్యే ఈ మినీ శ్రేణి కార్లు కంప్లీట్లీ బిల్ట్‌ అప్‌ యూనిట్‌ (సీబీయూ) రూపంలో భారత్‌లోకి దిగుమతి అవుతాయి.

మినీ 3-డోర్‌ హ్యాచ్‌ 6.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇదే వేగాన్ని అందుకునేందుకు మినీ కన్వర్టబుల్‌ మోడల్‌కు 7.1 సెకన్‌ సమయం అవసరం. ఈ కార్లలో అధిక ధర కలిగిన మినీ జాన్‌ కాపర్‌ వర్క్స్‌ హ్యాచ్‌ 6.1 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మినీ 3-డోర్‌ హ్యాచ్, మినీ కన్వర్టబుల్‌ రెండు లీటర్ల పెట్రోల్‌ 
ఇంజిన్‌తో వస్తున్నాయి. 

చదవండి: BMW : మూడు సెకన్లలోనే అంత వేగమా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement