బీఎండబ్ల్యూ కొత్త కారు ధర ఎంతో తెలుసా? | BMW 740Li launched in India at Rs 1.26 crore | Sakshi
Sakshi News home page

బీఎండబ్ల్యూ కొత్త కారు ధర ఎంతో తెలుసా?

Published Wed, Dec 21 2016 4:07 PM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

బీఎండబ్ల్యూ కొత్త కారు ధర ఎంతో తెలుసా?

బీఎండబ్ల్యూ కొత్త కారు ధర ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ:  బీఎండబ్ల్యూ కొత్త కారు మార్కెట్లో లాంచ్ అయింది.   పాపులర్ 7  సిరీస్ లోని సరికొత్త  740లీటర్ల  వేరియంట్ ను భారత మార్కెట్లో  ప్రవేశపెట్టింది. దీని ధరను రూ. 1.26 కోట్లుగా (ఎక్స్ ఫో రూం ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది  కాగా ఇప్పటికే 750 లీటర్ల పెట్రోల్ ,, 730 లీటర్ల డీజిల్ వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.  తమ   మోడల్స్ అన్నింటినీ  పెట్రోల్ వెర్షన్ లో లాంచ్ చేయనున్నామన్న  తాజా ప్రకటనలో్ నేపథ్యంలో దీన్ని విడుదల చేసింది.
 ఆరు సిలిండర్ల 2998సీసీ ఇంజీన్,
326హెచ్ పీ విత్   మాక్సిమమ్ టార్క్  450ఎన్ ఎం
ఎయిట్ స్పీడ్  సెప్టాట్రానిక్ ట్రాన్సిమిషన్
లీటరుకు 12.5 కి.మీ   ఇంధన సామర్ధ్యం
20 ఇంచెస్  అల్లో వీల్స్
5.2 సెకండ్స్ లో 100 కి.మీ  వేగంతో దూసుకుపోనుంది. గరిష్టంగా గంటలకు  250 కి.మీ వేగం. ట్యాంక్ కెపాసిటీ 78 లీటర్లు. బీఎం డబ్ల్యూ  హై ఎండ్ కార్లలో  సాధారణంగా ఉంటే  క్రాష్ సెన్సర్ , ప్రెషర్ ఇండికేటర్ , డ్రైవర్ కి ఎయిర్ బ్యాగ్, నీ(మోకాలి)  ఎయిర్ బ్యాగ్ , పాసింజర్ ఇద్దరికీ ఎయిర్ బ్యాగ్స్, హెడ్ ఎయిర్ బ్యాగ్స్ ,  ఇంటీరియర్ రీల్ బెల్ట్స్ అమర్చింది.   పటిష్టమైన వీల్ బేస్ తో వస్తున్న ఈ కార్ లో  సెర్వోట్రానిక్ ఫంక్షన్  అండ్ ఇంటిగ్రెల్ స్టీరింగ్ లక్షణాలున్న ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ అదనపు ఆకర్షణగా నిలవనుంది. మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, ఆడి ఏ 8 ,జాగ్వార్ ఎక్స్ జె లకు ఈ సరికొత్త కారు గట్టిపోటీ ఇవ్వనుంది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement