moving
-
విగ్రహాలకు స్థానచలనం
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ ప్రాంగణంలో చూడగానే ఎదురుగా కనిపించే మహాత్మా గాంధీజీ, బీఆర్ అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ మహరాజ్, జ్యోతిబా ఫూలే సహా పలువురు దేశ ప్రముఖుల విగ్రహాలను ప్రభుత్వం వేరే చోటుకు తరలించింది. ఉన్న చోటు నుంచి పాత పార్లమెంట్(సంవిధాన్ సదన్)లోని ఐదో నంబర్ గేట్ దగ్గరి లాన్ వద్దకు మార్చింది. ఈ లాన్లో ఇప్పటికే గిరిజన యోధుడు బిర్సా ముండా, మహారాణాప్రతాప్‌ల విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల తరలింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘మహాత్ముడు, అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా అప్రాధాన్య చోట్లో ప్రతిష్టించడం అరాచకం’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు బీజేపీని తిరస్కరించారు. అందుకే మహారాష్ట్రతో అనుబంధమున్న ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్ల విగ్రహాలను వేరే చోటుకు మార్చేశారు. గుజరాత్లో బీజేపీ ఈసారి క్లీన్‌స్వీప్ చేయలేకపోయింది. అందుకే గుజరాతీలపై ఆగ్రహంతో గాం«దీజీ విగ్రహాన్నీ తరలించారు’ అని మరో నేత పవన్ ఖేడా వ్యాఖ్యానించారు. ‘మహానుభావుల విగ్రహాలు తొలగించి గాడ్సే, మోదీ విగ్రహాలు పెడతారా?’ అని టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ ప్రశ్నించారు. విమర్శలపై లోక్‌సభ సచివాలయం స్పందించింది. పార్లమెంట్‌కు విచ్చేసే సందర్శకులు చూసేందుకు అనువుగా ‘ప్రేరణ స్థల్’కు విగ్రహాలను తరలించామని పేర్కొంది. ఏ విగ్రహాన్ని పక్కనపడేయలేదని స్పష్టంచేసింది. -
కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం
గురుగ్రామ్: కదులుతున్న బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది సజీవదహనం అయ్యారు. 17 మంది గాయపడ్డారు. హరియాణాలోని నుహ్ జిల్లా టౌరు సమీపంలో శని వారం వేకువజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. పంజాబ్‌లోని హోషియార్పూర్, లూధియానా జిల్లాలకు చెందిన సుమారు 60 మందితో కూడిన బంధువర్గం మథుర, బృందావన్ తీర్థయాత్రకు వెళ్లి తిరిగివస్తోంది. వీరి బస్సులో కుండ్లి– మనేసర్– పల్వాల్(కేఎంపీ)ఎక్స్‌ప్రెస్ వేపై వెళ్తుండగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న పలువురు వాహన చోదకులు గమనించి డ్రైవర్‌ను హెచ్చరించారు. అతడు పట్టించుకోకపోవడంతో బస్సును వెంబడించారు. ఈలోగా బస్సులోపల మంటలు, పొగ వ్యాపించడంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి పరారయ్యాడు. బస్సు మెయిన్ డోర్ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు కిటికీల నుంచి అతికష్టమ్మీద కిందికి దూకారు. అప్పటికే బస్సులోని 9 మంది ప్రాణాలు కోల్పోయారు. -
A23a: అతి పెద్ద ఐస్‌బర్గ్... 40 ఏళ్ల తర్వాత కదిలింది
అది ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్‌బర్గ్. పేరు ఏ23ఏ. విస్తీర్ణం ఏకంగా 4,000 చదరపు కిలోమీటర్లు. మరోలా చెప్పాలంటే పరిమాణంలో గ్రేటర్ లండన్‌తో పోలిస్తే రెండింతలకు పై చిలుకే. అంతటి విస్తీర్ణంతో, ఏకంగా 400 మీటర్ల మందంతో భారీ సైజుతో అలరారుతూ చూసేందుకది ఓ మంచు ద్వీపకల్పంలా కని్పంచేది. అలాంటి ఐస్‌బర్గ్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కదలడం మొదలు పెట్టింది. ఈ పరిణామం పర్యావరణ నిపుణులను ఆందోళన పరుస్తోంది. గ్లోబల్ వార్మింగ్ తాలూకు దుష్పరిణామాలకు దీన్ని తాజా సంకేతంగా వారు భావిస్తున్నారు... 1986 నుంచీ... ఏ23ఏ ఐస్‌బర్గ్ అప్పుడెప్పుడో 1985 చివర్లో అంటార్కిటికా తీరం నుంచి విడిపోయింది. అంటార్కటికా తాలూకు అతి పెద్దదైన ఫిల్‡్షనర్ మంచు ఫలకం నుంచి విడిపోయిన భారీ ఐస్బర్గ్ల్లోకెల్లా పెద్దదిగా ఇది రికార్డులకెక్కింది. అప్పటికే ఏ23ఏపై సోవియట్ యూనియన్ ఒక పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేసుకుంది! అందులోని సామగ్రినంతటినీ అది హుటాహుటిన తరలించడం మొదలు పెట్టింది. కానీ కొద్దిపాటి ప్రయాణం అనంతరం 1986కల్లా అంటార్కిటికా పరిధిలోని వెడెల్ సముద్రంలో ఐస్‌బర్గ్ నిశ్చలంగా నిలిచిపోయింది. ఒకరకంగా సముద్రం తాలూకు అడుగు భాగంతో కలిసిపోయి అలా నిలబడిపోయింది. కరిగిపోతోంది... ఇంతకాలం నిశ్చలంగా ఉన్నది కాస్తా ఏ23ఏ ఇప్పుడు మరోసారి కదులుతోంది. దీనికి కారణాలపై సైంటిస్టులంతా దృష్టి సారించగా, ఇది అంటార్కిటికా సముద్ర జలాల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతున్న ఫలితమేనని తేలింది! ‘‘దాదాపు 40 ఏళ్ల కాలగమనంలో ఐస్‌బర్గ్ పరిమాణంలో కుంచించుకుపోయింది. దానికి గ్లోబల్ వార్మింగ్ తోడైంది’’ బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే రిమోట్ సెన్సింగ్ నిపుణుడు డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు. వాస్తవానికి ఏ23ఏలో 2020లోనే అతి తక్కువ స్థాయిలో కదలికలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. సముద్ర పవనాల హోరు, ప్రవాహాల జోరుకు అదిప్పుడు వేగం పుంజుకుందన్నారు. ఇప్పుడది క్రమంగా అంటార్కిటిక్ ద్వీపకల్పపు ఉత్తరాగ్రంకేసి కదులుతోంది. చివరికది ఐస్‌బర్గ్‌ల క్షేత్రంగా పిలిచే అంటార్కిటికా దక్షిణ ప్రాంతానికి చేరేలా కని్పస్తోంది. ప్రమాద ఘంటికే...! ఎంత పెద్ద ఐస్‌బర్గ్‌లైనా కాలక్రమంలో చిక్కిపోవడం, క్రమంగా కనుమరుగవడం పరిపాటే. కానీ అందుకు వందలు, కొన్నిసార్లు వేలాది ఏళ్లు కూడా పడుతుంటుంది. అలాంటి ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ఏ23ఏ ఐస్‌బర్గ్ ఇలా శరవేగంగా కరుగుతుండటం, కదిలిపోతుండటం ప్రమాద సూచికేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది దక్షిణ జార్జియాకేసి సాగితే అక్కడి జీవావరణానికి పెద్ద సమస్యగా కూడా మారవచ్చని చెబుతున్నారు. దాని నుంచి కరిగే నీటితో పెరిగిపోయే సముద్ర మట్టం ఆ ద్వీపకల్ప తీరంలో లక్షలాది సీల్స్, పెంగ్విన్లు, సముద్ర పక్షుల పునరుత్పత్తి ప్రాంతాలను ముంచెత్తవచ్చన్నది వారి ఆందోళన. అయితే ఈ పరిణామంతో కొన్ని లాభాలూ లేకపోలేదట! ‘‘ఐస్‌బర్గ్‌లు జీవనప్రదాలు కూడా. కరిగే క్రమంలో వాటినుంచి విడుదలయ్యే ఖనిజ ధూళి సమీప సముద్ర జీవజాలానికి ప్రాణాధారంగా మారుతుంది’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైలు కదిలేముందు జర్క్ ఎందుకు? న్యూటన్ నియమంతో సంబంధం ఏమిటి?
భారతదేశంలో దాదాపు 125 కోట్ల మంది నివసిస్తున్నారు. వీరిలో చాలామంది దూర ప్రయాణాలకు రైళ్లను ఆశ్రయిస్తుంటారు. అయితే కొన్ని రైళ్లు బయలుదేరేముందు ఒక కుదుపునకు గురి చేసి, ఆ తర్వాత ముందుకు కదలడాన్ని మీరు గమనించేవుంటారు. ఇది ప్రతి రైలులోనూ జరగదు. కొన్ని రైళ్లలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఇటువంటి రైళ్ల ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రైళ్లలోనే జర్క్ అనుభూతి నిజానికి ఈ జర్క్కు కారణం రైలు కోచ్. కొన్ని రకాల కోచ్‌లు ఉన్న రైళ్లలో మాత్రమే మనకు ఈ జర్క్ అనేది వస్తుంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కలిగిన రైళ్లలో ఇటువంటి జర్క్ మనకు అనుభవానికి వస్తుంది. ఈ తరహా కోచ్‌లలో ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే కప్లింగ్ల డిజైన్ చాలా పాతదై ఉంటుంది. దీంతో వాటి స్థాయి ఇటువంటి జర్క్లను నియంత్రించేందుకు అనువుగా ఉండదు. వీటిలో తక్కువ జర్క్ ఐసీఎఫ్ కోచ్‌లు కలిగివున్న రైళ్లు వాటి కప్లింగ్లలో జర్క్ రెసిస్టెంట్ సస్పెన్షన్లను కలిగి ఉంటాయి. ఐసీఎఫ్ కోచ్‌లతో రైలు నడుస్తున్నప్పుడు చాలా స్వల్పస్థాయి జర్క్ మాత్రమే సంభవిస్తుంది. కప్లింగ్‌లు గుండ్రంగా ఉండి, రెండు కోచ్‌లు ఒకదానికొకటి అనుసంధానమయ్యే చోట ఉంటాయి. న్యూటన్ మొదటి నియమం.. న్యూటన్ మొదటి నియమం కూడా ఇటువంటి జర్క్కు కారణంగా నిలుస్తుంది. అదే జడత్వ నియమం. వాస్తవానికి మీరు రైలులో కూర్చున్నప్పుడు, మీ శరీరం స్థిరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో రైలు అకస్మాత్తుగా ముందుకు కదులుతున్నప్పుడు.. మీ శరీరం దాని స్థానంలో అది ఉన్నప్పటికీ, రైలు కదలిక కారణంగా జర్క్ అయినట్లు అనుభూతి కలుగుతుంది. ఇది కూడా చదవండి: శాంతినికేతన్‌తో చైనాకు లింకు ఏమిటి? -
పోలీసు స్టిక్కర్ తగిలించి.. గంజాయి తరలించి
రామచంద్రాపురం (పటాన్చెరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని బాలానగర్ ఎస్వోటీ, రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ నరేందర్‌రెడ్డి అందించిన వివరాలివి. మహారాష్ట్ర బడ్లాపూర్‌కు చెందిన ధీరజ్ మున్నాలా డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాడు. అందులో సరైన ఆదాయం రాకపోవడంతో స్నేహితుడు ప్రశాంత్ సంజయ్ షిండేతో కలిసి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయించాలని నిర్ణయించాడు. ఇన్నోవా కారు అద్దెకు తీసుకొని ఇద్దరూ విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వినయ్ మండల్ ద్వారా కిలో రూ.3 వేల చొప్పున 58.5 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని 39 ప్యాకెట్లుగా విభజించి కారులో పెట్టుకుని మహారాష్ట్రకు బయల్దేరారు. వీరు గంజాయి తరలిస్తున్నట్లు గురువారం సాయంత్రం బాలానగర్ ఎస్వోటీ పోలీసులు, రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందింది. దీంతో రామచంద్రాపురం పట్టణ పరిధిలోని ఇక్రిశాట్ వద్ద గంజాయి తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పట్టుకున్నారు. అందులో ఉన్న ధీరజ్ మున్నాలా జైస్వాల్, ప్రశాంత్ సంజయ్ షిండేలను అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది. కాగా ఇన్నోవా వాహనానికి నంబర్ ప్లేట్ మార్చి, ముందు భాగంలో పోలీస్ స్టిక్కర్‌ను పెట్టుకొని గంజాయిని తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. దాంతో వారి వద్ద నుంచి రూ.11 లక్షల 70 వేల విలువైన 58.8 కిలోల గంజాయిని, ఇన్నోవా కారు, డూప్లికేట్ నంబర్ ప్లేట్, కొడవలి, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ మున్ముందుకే
ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న ఇండియా ఇక ముందు ఎలెక్ట్రిక్ ఆటోమొబైల్ వాహనాల రంగంలో కూడా ముందుకు సాగే అవసరంతోపాటు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెట్రోలు, డీసెల్ బదులు విద్యుత్ బ్యాటరీలతో నడిచే వాహనాల వినియోగాన్ని నేటి ప్రపంచంలో ‘గ్రీన్ మొబిలిటీ’ అని పిలుస్తున్నారు. గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ సైతం ప్రగతి సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన కృషి చేస్తోంది. ప్రపంచంలో ఆటోమొబైల్ రంగంలో చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది మూడో ర్యాంకర్ జపాన్ను ఆటో అమ్మకాల్లో ఇండియా అధిగమించింది. కిందటేడాది జపాన్ 42 లక్షల ఆటోమొబైల్ వాహనాలను అమ్మగా, ఇండియాలో 42 లక్షల 50 వేల వాహనాలు అమ్ముడయ్యాయి. వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశంలో ఎలెక్ట్రిక్ కార్లు, ఇతర రకాల వాహనాల ఉత్పత్తి పెరిగితే ఆటో రంగంలో చైనా, అమెరికాలను ఇండియా దాటిపోతుందని కేంద్ర ప్రభుత్వం అంచనావేస్తోంది. అమెరికాలోని అట్లాంటిక్ మహాసముద్ర తీరంలోని పెద్ద రాష్ట్రం జార్జియా గ్రీన్ మొబిలిటీలో అగ్రభాగాన నిలిచే దిశగా ముందుకు సాగుతోంది. ఈ రాష్ట్రాన్ని అమెరికాకు ‘ఎలెక్ట్రిక్ మొబిలిటీ రాజధాని’గా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఆటోమొబైల్ రంగంలో అమెరికాలో మొదటి స్థానంలో ఉన్న మిషిగన్ రాష్ట్రాన్ని మించిపోతుందని అంచనా. గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ నాలుగేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ, వాటికి అవసరమైన బ్యాటరీలు, చార్జింగ్ పరికరాలు ఉత్పత్తి విస్తరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని సర్కారు ఏటా ప్రోత్సాహకాలు ప్రకటాస్తూ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో ఎలెక్ట్రిక్ (గ్రీన్) మొబిలిటీకి తగిన వ్యవస్థ, వాతావరణం ఏర్పాటు చేయడానికి గతంలోనే ఈ రంగంలో అనుభవం ఉన్న ‘ఊర్జా గ్లోబల్’ అనే కంపెనీతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ) ఒప్పందం చేసుకుంది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం లిథియం-అయాన్ బ్యాటరీలు, ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లు ఏపీలో ఏర్పాటవుతాయి. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఊర్జా గ్లోబల్ రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పరిశ్రమల వల్ల 250 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలుంటాయని అప్పుడు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ ను ఎలెక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ కేంద్రంగా చేయడానికి వరల్డ్ ఇకనామిక్ ఫోరమ్ తో కలిసి ఏపీ సర్కారు కిందటేడాది ఆగస్టులో ఏర్పాటు చేసిన తొలి వర్చ్యుల్ మీటింగ్ విజయవంతంగా జరిగింది. విద్యుత్ వాహనాల రంగంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని ఈ సమావేశంలో ప్రసంగించిన నీతి ఆయోగ్ సలహాదారు సుధేందు సిన్హా విశ్వాసం ప్రకటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న సాంప్రదేయేతర ఇంథన వనరుల ఉత్పత్తి కారణంగా ఎలెక్ట్రిక్ వాహనాల రంగం విస్తరణకు అనువైన వాతావరణం ఉందని అందరూ గుర్తిస్తున్నారు. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు -
137 టన్నుల బండ రాయి.. పిల్లలు కూడా సింపుల్‌గా జరపగలరు.. కారణం తెలుసా?
తన చిటికెన వేలితో కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తినట్లు.. మీరు కూడా వంద టన్నుల బరువైన ఓ బండరాయిని కదిలించగలరు. ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఫ్యాక్టే ఇది. ఫ్రాన్స్‌లోని హుయెల్గోట్ అడవిలో ‘షేకింగ్ రాక్’ పేరుతో ఓ బండరాయి ఉంది. ఏడు మీటర్ల పొడవు, 137 టన్నుల బరువైన ఈ రాయిని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు గుర్తించి, ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు.. ఈ రాయిని కదిలించడానికి కండలు తిరిగిన శరీరం ఉండాల్సిన పనిలేదు.. పిల్లలు కూడా కదలించవచ్చు అని. (చదవండి: Russian Ukraine War: 19 ఏళ్ల బంధం.. ఉక్రెయిన్ అధ్యక్షుడి ముచ్చటైన కుటుంబం! ఆయన భార్య ఎవరంటే! ) కేవలం రాయి ఉండే కోణం, ప్రదేశం కారణంగానే ఇది సాధ్యమవుతోందని, అడవి నుంచి బయటకు తీసుకొస్తే ఆ ప్రత్యేకత పోతుందని బండరాయిని అక్కడే ఉంచారు. అప్పటి నుంచి రోజూ ఈ రాయిని చూడ్డానికి ఎంతోమంది వస్తున్నారు. మ్యాజిక్ చేసేవారు చిన్న చిన్న లాజిక్స్ ఉపయోగించి అసాధ్యాన్ని సుసాధ్యంగా భ్రమింప చేస్తున్నట్లు... మీరెప్పుడైనా ఫ్రాన్స్‌కు ప్రయాణమైతే అ అడవికి వెళ్లి చిన్న లాజిక్‌ను వాడి ఆ బండరాయిని కదిలించి ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేసుకోండి. -
ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..!
ఇంటికి కాళ్లుంటే! ఇదిగో ఈ ఫొటోలో ఉన్నట్లే ఉంటుంది. ఈ ఇంటికి ఉన్న కాళ్లు కర్రకుర్చీకి ఉన్నలాంటి కదలని కాళ్లు కావు. ఎక్కడకనుకుంటే అక్కడకు నడిచే కాళ్లు. తమపై నిర్మించిన ఇంటిని ఎక్కడకనుకుంటే అక్కడకు మోసుకుపోయే కాళ్లు. ఫ్రాన్స్‌లోని ‘యూబిసాఫ్ట్’ సంస్థకు చెందిన త్రీడీ డిజైనర్ ఎంకో ఎన్షెవ్ వైరైటీగా ఈ కదిలే కాళ్లు గల ఇంటికి రూపకల్పన చేశాడు. ఇంటికి ఏర్పాటు చేసిన ‘మెకానికల్ లెగ్స్’ అడుగులు ముందుకు వేస్తూ ఎక్కడకు నిర్దేశిస్తే అక్కడకు చేరుకోగలవు. ఎలాంటి మిట్టపల్లాలనైనా సునాయాసంగా దాటగలవు. ఇదొక ‘రెట్రో–ఫ్యూచరిస్టిక్’ డిజైన్ అని ఎన్షెవ్ చెబుతున్నాడు. భవిష్యత్తులో పిక్నిక్లు వంటి అవసరాల కోసం వాహనాలకు బదులుగా ఇలాంటి ఇళ్లు వినియోగంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని త్రీడీ డిజైనింగ్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి: Pratima Joshi: ‘బస్తీ చిన్నది... భలేగున్నది’ అనుకునేలా చేసింది.. -
Tiger: దాగుడుమూతల పులి.. ఒక్కచోట ఉండదే..
సాక్షి, దహెగాం(ఆదిలాబాద్): పులి భయాందోళన సృష్టిస్తోంది. స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకోని వ్యాఘ్రం నిత్యం వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయపెడుతోంది. గత రెండు వారాలు కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఎక్కువగా తారసపడుతుంది. అడవిని వదిలి మైదాన ప్రాంతాల్లోకి వస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతుంది. స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకోవడం మరచిన పులి నిత్యం దహెగాం, పెంచికల్పేట్, బెజ్జూర్, సిర్పూర్(టి) మండలాల్లో సంచరిస్తుంది. పెద్దవాగు దాటి మైదాన ప్రాంతాల్లోకి వస్తూ భయాందోళనకు గురిచేస్తోంది. గతేడాది నవంబర్, డిసెంబర్ మాసంలో జిల్లాలో ఇద్దరిని హతమార్చింది. అప్పటి నుంచి పులి ఉనికిని చాటుకుంటుంది. మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి ఉమ్మడి జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్‌కు నిత్యం రాకపోకలు సాగిస్తోంది. ఈక్రమంలో కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో సంచరిస్తోంది. ఇక్కడ అడవులు నరకడం, దట్టమైన ప్రాంతం లేకపోవడంతో దారి తప్పుతున్న పులి నిత్యం మైదాన ప్రాంతాల్లోకి వస్తోంది. ఈక్రమంలోనే పశువులు, మనుషులపై దాడులకు పాల్పడుతోంది. పెరిగిన సంచారం.. ఇటీవల కాలంలో పులి సంచారం ఎక్కువగా పెరిగింది. దహెగాం మండలంలోని చెడ్వాయి అటవీ ప్రాంతం నుంచి ఆదివారం పెద్దవాగు దాటి ఐనం, పొలంపల్లి, పెసరికుంట, మంచిర్యాల జిల్లా భీమిని మండలం చినగుడిపేట శివారుకు వెళ్లింది. ఈక్రమంలో పత్తి చేలలో పనులు చేసుకుంటున్న రైతులు పులిని గుర్తించి భయాందోళనకు గురయ్యారు. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అడుగుల ఆధారంగా ట్రేస్ చేసే పనిలో పడ్డారు. అలాగే ఆదివారం రాత్రి బెజ్జూర్ మండలం చిన్నసిద్దాపూర్ సమీపంలో పులి సంచరిస్తుండడంతో రమేశ్, నగేశ్ అనే వ్యక్తుల కంటపడింది. కేకలు వేయడంతో వెనుదిరిగింది. సిర్పూర్(టి) రేంజ్ పరిధిలో గత రెండు వారాలుగా పులి కదలికలు ఉన్నాయి. ఇటిక్యాల పహాడ్, నవేగాం, హుడ్కిలి, జక్కాపూర్, లక్ష్మీపూర్, భూపాలపట్నం, చింతకుంట, హీరాపూర్, కేశవపట్నం, లింబుగూడ, రావన్‌పల్లి గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరించింది. ఈక్రమంలో తరచూ పశువులపై దాడులకు పాల్పడుతూ హతమార్చుతోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిక్కదు.. దొరకదు నిత్యం పశువులపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్న పులి అధికారులకు మాత్రం చిక్కడం లేదు. గతేడాది నవంబరులో దహెగాం మండలంలోని దిగిడ గ్రామానికి చెందిన సిడాం విగ్నేష్ అనే యువకుడిని పులి హతమార్చింది. అదే నెలలో పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన యువతిని పైతం పత్తి చేనులో చంపింది. దీంతో పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి లేగదూడలను ఎరగా పెట్టారు. అయినా పులి బోన్ల వైపు రావడం లేదు. డివిజన్ పరిధిలో నాలుగు పులులు సంచరిస్తున్నట్లు అధికారులు గతంలోనే ప్రకటించారు. అయితే ఎప్పుడు ఏ పులి వస్తుందో తెలియకుండా ఉంది. సరిహద్దుకు అవతలి వైపు అటవీ అధికారులు అధునాత సాంకేతికతో పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడి అధికారుల సాయంతో పులిని బంధించేందుకు యత్నించినా దీనిపై అధికారులు అంతగా దృష్టి సారించడం లేదు పులి నుంచి అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించడం మినహా అధికారులు ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో మరో ప్రాణనష్టం సంభవించక ముందే పులిని పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని రైతులు, అటవీ సమీప గ్రామాల ప్రజలు విన్నవిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి రాకపోకలు.. మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి కాగజ్‌నగర్ కారిడార్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న పులి కవ్వాల్ అభయారణ్యంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచించారు. అందుకనుగుణంగా అటవీ అధికారులు భారీగా నిధులు ఖర్చు చేసినా పులి మాత్రం కవ్వాల్కు రావడం లేదు. మహారాష్ట్రతో సరిహద్దు ఉన్న కాగజ్‌నగర్ డివిజన్‌లోనే నిత్యం సంచరిస్తుంది. మహారాష్ట్రలోని వీరూర్, దాబా రేంజ్ పరి«ధి నుంచి ఇటీవల పులి రాకపోకలు ఎక్కువయ్యాయి. సిర్పూర్(టి)– వీరూర్ అటవీప్రాంతాల గుండా పులి ఆనవాళ్లను అధికారులు ట్రేస్ చేశారు. చదవండి: Karimnagar: అత్తగారింట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య -
కర్ఫ్యూ భయం.. సొంత గ్రామాలకు తరలివెళ్తున్న జనం
-
వింత సంఘటన: దెయ్యం పనేనా!
అహ్మదాబాద్: గుజరాత్లో వింత సంఘటన చోటుచేసుకుంది. ఇంటిముందు పార్క్ చేసి ఉన్న ఓ ద్విచక్రవాహనం అర్థరాత్రి దానికి అదే కదిలిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ వీడియోను అంబర్ జైదీ అనే ట్వీటర్ యూజర్ ఖాతాలోని ఈ పోస్ట్ వైరల్‌గా వారింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదెలా సాధ్యమంటూ అక్కడ ఏముందో తెలుసుకునే పనిలో పడ్డారు. ‘కెమెరాలో రికార్డు అయ్యింది.. లేదంటే ఎవరూ నమ్మేవారు కాదు’ అంటూ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. (చదవండి: డ్రైవర్ లేకుండా ముందుకెళ్లిన బస్.. వీడియో వైరల్) 30 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో నిశ్శబ్ధంగా ఉన్న వీధిలో అర్థరాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న వాహనం ఉన్నట్టుండి దానికి అదే ముందుకు కదిలింది. అలా కదులుతూ టర్న్ చేసుకుంటుండగా ఆ వాహనం కింద పడిపోయింది. అయితే దానిపై ఎవరూ లేకపోవడంలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘నమ్మలేక పోతున్న.. దెయ్యాలు నిజంగా ఉంటాయి’, ‘ఆత్మలు ఉంటాయడానికి ఇదే ఉదహరణ’, ‘ఎవరిదో ఆత్మ ఈ బండిలో దూరింది’ అంటూ నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: 57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను) -
భూమి ధ్రువాలు ఉల్టా పల్టా..!
ఎక్కడో అంటార్కిటికాలోని పక్షులు... ఉత్తరాన సైబీరియాకు వలస వెళుతూంటాయి. ఎలా? వాటిల్లో భూ అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించే కంపాస్ లాంటిది ఉంటుంది కాబట్టి! మరి.. ఈ అయస్కాంత క్షేత్ర ధ్రువాలు తిరగబడితే? అలా ఎందుకు అవుతుందనుకోవద్దు. త్వరలోనే ఇది జరగబోతోంది. కొంచెం గందరగోళంగా అనిపిస్తోందా...? వివరంగా అర్థం చేసుకుందాం. భూగర్భంలో కుతకుత ఉడికే ఇనుము ఉంటుంది. ఇది అటు ఇటు ప్రవహించే క్రమంలో భూమి చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి కాబట్టే.. మన కంపాస్లలో చూపే ఉత్తరం.. అయస్కాంత క్షేత్రం తాలూకు దక్షిణ ధ్రువమై ఉంటుంది. త్వరలో ఉత్తరం.. దక్షిణంగా మారనుంది. అలాగే దక్షిణ ధ్రువం కాస్తా ఉత్తరంగా మారనుంది. ఇంకోలా చెప్పాలంటే ఆర్కిటిక్ ప్రాంతం అయస్కాంతక్షేత్ర దక్షిణ ధ్రువంగా మారితే.. అంటార్కిటికా కాస్తా ఉత్తర ధ్రువ ప్రాంతంగా మారుతుందన్నమాట. గత శతాబ్ద కాలంలో అయస్కాంత ధ్రువం ఏటా దాదాపు 64 కిలోమీటర్ల చొప్పున స్థానభ్రంశం చెందుతూ వస్తోందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే దీనివల్ల మనకేమీ ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే దాదాపు రెండు మూడు లక్షల ఏళ్ల క్రితం కూడా ధ్రువాలు తారుమారైనప్పుడు ఎలాంటి విపత్తూ జరగలేదని శిలాజాల ద్వారా తెలుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాకపోతే మెదడులోనే కంపాస్లు కలిగి ఉండే వలస పక్షులపై ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పిలిస్తే పలికే అలెక్సా చేతుల్లోకి వచ్చేస్తోంది.. అమెజాన్ అలెక్సా గురించి మీరు వినే ఉంటారు. కృత్రిమ మేధ సాయంతో నిర్మాణమైన ఈ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ మీరు ఏ ప్రశ్న అడిగినా ఠకీమని సమాధానమిస్తుంది. ఇదంతా ఇప్పుడెందుకూ అంటే.. త్వరలోనే ఇది వాచీల్లోకి ఇమిడిపోనుంది కాబట్టి! ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉండే అలెక్సా – ఎకో చిన్న డబ్బా సైజులో ఉంది. దీన్ని ఇంట్లో ఉంచుకుని.. తగిన నెట్వర్కింగ్ చేసుకుంటే.. అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలనూ దీని సాయంతోనే నియంత్రించవచ్చు. ‘‘అలెక్సా.. ఏసీ ఆఫ్ చేసేయ్’’ అంటే వెంటనే కట్టేస్తుందన్నమాట. ఇంతటి శక్తిమంతమైన సాఫ్ట్‌వేర్‌ను త్వరలో లాస్‌వెగాస్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారని సమాచారం. ఇప్పటికే అందుబాటులో ఉన్న అలెక్సా మొబైల్ యాక్సెసరీ కిట్ సాయంతో డెవలపర్లు దాదాపు అన్ని రకాల వేరబుల్స్ (ధరించగలిగేవి)లోకి అలెక్సాను జొప్పించవచ్చునని అమెజాన్ అంటోంది. ఆడియో పరికరాల తయారీ సంస్థ బోస్ అలెక్సా సాయంతో అత్యాధునిక ఇయర్ఫోన్లను తయారుచేసేందుకు రెడీ అవుతూంటే మొబైల్ ద్వారా కూడా అలెక్సా సేవలు అందించేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మొబైల్ యాక్సెసరీ కిట్‌ను అందుబాటులోకి తేవడం వల్ల హార్డ్‌వేర్ కంపెనీలు సాఫ్ట్వేర్ కోడింగ్‌కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని అమెజాన్ ప్రతినిధి గగన్ లూథ్రా తెలిపారు. కళ్లలోకి చూస్తే... జబ్బులేమిటో తెలుస్తాయా? కళ్లు మన మనసులోని భావాలను ప్రదర్శించేందుకు కొద్దోగొప్పో ఉపయోగపడతాయిగానీ.. బబ్బుల వివరాలు ఎలా తెలుస్తాయి అని ఆశ్చర్యపోనవసరం లేదు. అంతా డీప్ లెర్నింగ్ టెక్నాలజీ మహిమ. విషయం ఏమిటంటే.. గూగుల్‌కు చెందిన పరిశోధన విభాగం కేవలం కళ్లలోని భాగాల తాలూకూ ఫొటోల (ఫండూస్ ఇమేజెస్ అని పేరు) ద్వారా వారి వయసుతోపాటు రక్తంలోని చక్కెర శాతం (హెచ్మీఏ1సీ), రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు వంటి వివరాలన్నింటినీ సేకరించవచ్చునని ప్రకటించారు. ఇందుకోసం గూగుల్ రీసెర్చ్ విభాగపు శాస్త్రవేత్తలతోపాటు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దాదాపు 2.8 లక్షల మంది కనుగుడ్డు తాలూకు చిత్రాలను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలించారు. టెన్సర్‌ఫ్లో అనే కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్ సాయంతో జరిపిన ఈ పరిశీలన ద్వారా చెప్పుకోదగ్గ కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఫిలిప్ నీల్సన్ తెలిపారు. డీప్ లెర్నింగ్, మెషీన్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాఫ్ట్వేర్లు కనుగుడ్లను మాత్రమే కాదు... అతిసూక్ష్మమైన కణాల ఛాయాచిత్రాలతోనూ మనుపు ఎన్నడూ సాధ్యం కాని పనులు చేయగలుగుతున్నామని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం తాము ఉపయోగించిన సమాచారం చాలా చిన్నదని, మరింత ఎక్కువ సంఖ్యలో చిత్రాలను విశ్లేషించడం ద్వారా ఈ పద్ధతులకు పదును పెట్టవచ్చునని వివరించారు. -
‘నీరూ’ తరలుతోంది..
– పాల్వంచ ఇరిగేషన్ పరిధి నుంచి 324 చెరువులు ఔట్ – 9 మండలాలకు పరిమితమైన పాల్వంచ డివిజన్ – సత్తుపల్లి డివిజన్ కలిస్తే మరింతగా పెరగనున్న విస్తీర్ణం పాల్వంచ రూరల్: 15 ఏళ్ల క్రితం ఏర్పాటైన పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ ముక్కలు కానుంది. ఈ డివిజన్ నుంచి 324 చెరువులు బయటకు వెళ్లనున్నాయి. ఇప్పటి వరకు 12 మండలాలలో ఉన్న నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధిశాఖ (ఇరిగేషన్) డివిజన్ ఇక మీదట 9 మండలాలకు పరిమితం కానుంది. పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ నుంచి మూడు మండలాలు వివిధ జిల్లాల్లోకి వెళ్లనున్నాయి. డివిజన్లో ఇప్పటి వరకు పాల్వంచ, కొత్తగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, గార్ల, బయ్యారం, కామేపల్లి మండలాలు ఉండగా దీనిలో గార్ల, బయ్యారం మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్లనున్నాయి. కామేపల్లి ఖమ్మం జిల్లాలోకి చేరుతుండగా ఈ డివిజన్ 9 మండలాలకు పరిమితం కానుంది. ఇప్పటి వరకు అశ్వారావుపేట డివిజన్లో ఉన్న అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ మండలాలు ఈ డివిజన్ పరిధిలోకి వస్తే విస్తీర్ణం పెరగనుంది. 12 మండలాల నుంచి 13 మండలాలకు ఈ ఇరిగేషన్ డివిజన్ చేరుతుంది. చెరువులు అటూఇటూ పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 1,660 చెరువులున్నాయి. గార్ల, బయ్యారం మండలాల పరిధిలోని 222 చెరువులు మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్తున్నాయి. కామేపల్లి మండలంలోని 102 చెరువులు మాత్రం ఖమ్మం జిల్లాలో చేరనున్నాయి. ఈ మూడు మండలాల్లో కలిపి 324 చెరువులు పోతే 1336 చెరువులు పాల్వంచ డివిజన్ పరిధిలో ఉంటాయని ఇరిగేషన్ అధికారులు ధ్రువీకరించారు. ఆయా చెరువుల కింద 14,898 ఎకరాల ఆయకట్టు ఉంది. బయ్యారం పెద్దచెరువు మీడియం ఇరిగేషన్ కూడా మానుకోట జిల్లాలోకి వెళ్లడంతో 7,200 ఆయకట్టు విస్తీర్ణం తగ్గుతుంది. ‘కొత్త’గా 730 చెరువులు: వెంకటేశ్వరరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ పరిధిలోని గార్ల, బయ్యారం, కామేపల్లి మండలాల నుంచి 324 చెరువులు ఇతర జిల్లాల్లోకి వెళ్తున్నాయి. అదే సమయంలో సత్తుపల్లి డివిజన్లో ఉన్న అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ మండలాల పరిధిలోని 730 చెరువులు పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ పరిధిలోకి రానున్నాయి. ఇది ఖాయమైతే ఇరిగేషన్ డివిజన్ విస్తీర్ణం పెరుగుతుంది తప్ప తగ్గదు. -
ఫేస్ బుక్ లో ఆకట్టుకున్న ఘటన!
చాలామందికి నిద్రపోయే ముందు ఓ చిన్నపాటి భయం కలుగుతుంది. నిద్రించే సమయంలో ఇంట్లో ఏం జరుగుతుందోనని, ఉదయం నిద్ర లేచే వరకూ ఎలా ఉంటామోనని భయపడుతుంటారు. కొందరు ఎటువంటి భయం కలగకుండా, మంచి నిద్ర పట్టడంతోపాటు, శుభోదయం కావాలని కోరుతూ దేవుణ్ణి ప్రార్థిస్తారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయికి నిజంగానే నిద్రలో ఓ భయంకర అనుభవం ఎదురైందట. మంచి నిద్రలో ఉండగా వినిపించిన శబ్దానికి కళ్ళు తెరచి చూడగా జీవితంలో మరచిపోలేని దృశ్యం కనిపించిందట. దాంతో ఆమె తన అనుభవాలతో కూడిన ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ కు చెందిన ట్రినా హిబ్బర్డ్.. భయంకర శబ్దం విని, నిద్రలో ఉలిక్కిపడి లేచిందట. తాను ఊహించినట్లుగానే తనకు సమీపంలో ఓ 66 పౌండ్ల బరువు, 16 అడుగుల పొడవు ఉన్న పైథాన్ కనిపించడంతో పై ప్రాణాలు పైకే పోయాయట. ఆ కొండచిలువ తన మంచంమీదినుంచీ టోపీలు పెట్టుకునే షల్ఫ్ మీదుగా ఏకంగా గోడలకు తగిలించిన ఫోటో ఫ్రేములను చుట్టుకుంటూ, ఇంటి పై కప్పుకు చేరిందట. నాలుగేళ్ళక్రితం 2012 లో కూడ ఆమె ఈ పైథాన్ ను చూసిందట. ఇదంతా చూస్తే ఇదేదో దాని స్వంత ప్రాపర్టీలాగా ఉందని, ఇంతకు ముందు కూడా నీటికోసం పూల్ లోకి దిగుతుండగా ఆ పైథాన్ ను చూశానని ఆమె తన ఫేస్ బుక్ కామెంట్ లో రాసింది. అయితే అప్పట్లో దూరంగా చూసి పెద్దగా పట్టించుకోని ట్రినా.. ఇటీవలి ఘటన తర్వాత మాత్రం మరోసారి దానికి ఛాన్స్ ఇవ్వకోడదనుకుంది. అందుకే పాములు పట్టే మాంటీ అనే వ్యక్తిని పిలిచి పట్టించేసిందట. -
రైల్లోంచి పడి మహిళ మృతి
తాండూరు: రుక్మాపూర్-తాండూరు రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు ఓ మహిళ రైల్లో నుంచి కిందపడి మృతి చెందింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని మహిళ శవం రైలు పట్టాల వద్ద పడి ఉంది. ఇది గమనించి పక్కనే ఉన్న ట్రాక్ మన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ ప్రమాదవశాత్తు కిందపడి మరణించినట్లు నిర్ధారించుకున్నారు. మృతురాలికి సంబంధించిన ఎటువంటి వివరాలు తెలియరాలేదని తెలిపారు. రైల్లో భిక్షాటన చేసే ఆమెగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.