ఇంటికి కాళ్లుంటే! ఇదిగో ఈ ఫొటోలో ఉన్నట్లే ఉంటుంది. ఈ ఇంటికి ఉన్న కాళ్లు కర్రకుర్చీకి ఉన్నలాంటి కదలని కాళ్లు కావు. ఎక్కడకనుకుంటే అక్కడకు నడిచే కాళ్లు. తమపై నిర్మించిన ఇంటిని ఎక్కడకనుకుంటే అక్కడకు మోసుకుపోయే కాళ్లు. ఫ్రాన్స్‌లోని ‘యూబిసాఫ్ట్’ సంస్థకు చెందిన త్రీడీ డిజైనర్ ఎంకో ఎన్షెవ్ వైరైటీగా ఈ కదిలే కాళ్లు గల ఇంటికి రూపకల్పన చేశాడు. ఇంటికి ఏర్పాటు చేసిన ‘మెకానికల్ లెగ్స్’ అడుగులు ముందుకు వేస్తూ ఎక్కడకు నిర్దేశిస్తే అక్కడకు చేరుకోగలవు. ఎలాంటి మిట్టపల్లాలనైనా సునాయాసంగా దాటగలవు. ఇదొక ‘రెట్రో–ఫ్యూచరిస్టిక్’ డిజైన్ అని ఎన్షెవ్ చెబుతున్నాడు. భవిష్యత్తులో పిక్నిక్‌లు వంటి అవసరాల కోసం వాహనాలకు బదులుగా ఇలాంటి ఇళ్లు వినియోగంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని త్రీడీ డిజైనింగ్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
చదవండి: Pratima Joshi: ‘బస్తీ చిన్నది... భలేగున్నది’ అనుకునేలా చేసింది..
Comments
Please login to add a commentAdd a comment