
సాక్షి, జవహర్‌నగర్ (హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే దర్జాగా గంజాయి మొక్కలు పెంచుతున్నారు. నేరేడ్‌మెట్ డివిజన్ యాప్రాల్ గోదావరి గార్డెన్స్‌లో ఉన్న ఓ ఇంట్లో పూల కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న విషయం బయటపడింది. పక్కా సమాచారంతో జవహర్‌నగర్ సీఐ భిక్షపతిరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు శివ, శర్మఅనే మరో వ్యక్తితోపాటు.. విదేశీ మహిళతో కలిసి తన ఇంట్లో కొన్ని రోజులుగా గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
చదవండి: ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార దందా.. ఇద్దరు అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment