గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలు | Atrocities against girls under the influence of ganja | Sakshi
Sakshi News home page

గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలు

Published Sat, Jul 20 2024 3:52 AM | Last Updated on Sat, Jul 20 2024 3:53 AM

Atrocities against girls under the influence of ganja

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత

తిరుపతి(అలిపిరి)/తిరుమల: రాష్ట్రంలో గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడు­తు­న్నారని.. ఈ పరిణామాలు చూసి ప్రజలు భయాందోళనకు గురికావొద్దని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథి గృహంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి­భద్ర­తలు అదుపులో ఉన్నాయని, బాలికలపై దాడులు చేస్తున్న వారిని వెంటనే పట్టుకుంటున్నట్టు తెలిపారు. 

తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షిస్తున్నా­మన్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని చెప్పారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్‌­సీపీ నేతలు పాకులాడుతున్నారని, గత ప్రభుత్వం కారణంగానే చిన్నపిల్లల సంచుల్లోకి గంజాయి చేరుతోందని ఆరోపించారు. గంజాయిని రాష్ట్ర పంటగా పండించింది వైఎస్సార్‌­సీపీ నేతలేనని.. లిక్క­ర్‌­పైన పెట్టిన దృష్టి గంజాయిపై ఎందుకు పెట్టలేదన్నారు. పోలీ­సుల్ని కాపలాకు ఉపయోగించుకున్న గత ప్రభు­త్వంలోనే వందలాది మంది బాలికలు కనిపించకుండా పోయారని ఆరోపణలు చేశారు. 

ఇదిలా ఉండగా, కాలినడక మార్గంలోనే శ్రీవారి దర్శనం టికెట్లు జారీచేయాలని హోం మంత్రి అనిత కోరారు. అలిపిరి కాలినడక మార్గాన నడుచుకుంటూ ఆమె తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నడక మార్గంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని అనిత చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement