కారు ప్రమాదం, లోపల చూసి పోలీసులు షాక్‌ | Car Accident take Place in Gannavaram mandal. Ganja in Car | Sakshi
Sakshi News home page

కారు ప్రమాదం, లోపల చూసి పోలీసులు షాక్‌

Published Wed, Oct 14 2020 10:37 AM | Last Updated on Wed, Oct 14 2020 10:56 AM

Car Accident take Place in Gannavaram mandal. Ganja in Car - Sakshi

సాక్షి, విజయవాడ:  కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఒక అవాంఛనీయ సంఘటన జరిగింది.  జాతీయ రహదారిపై తెల్లవారుజామున లారీని తప్పించబోయిన ఒక ఇన్నోవా కారు డివైడర్ వద్ద ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొని డివైడర్ పైకి ఎక్కింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిని వెళ్ళడానికి వీలులేకపోవడంతో కారును అక్కడే వదిలి కారులో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. డివైడర్ పై ఉన్న కారును పోలీసులు పరిశీలించగా కారులో  పెద్ద మొత్తంలో గంజాయి ఉండడంతో పోలీసులు అవాక్కయ్యారు. కారు ఏలూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళుతూ ప్రమాదానికి గురయ్యింది. దీంతో పోలీసులు కారు మొత్తం పరిశీలించి కారులో ఎంత మంది ఉన్నారు, ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతున్నారు అనే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు.

చదవండి: అమ్మాయిలతో కాల్‌సెంటర్‌..డేటింగ్‌ ముఠా అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement