ఏజెన్సీ ప్రాంతం మీదుగా గంజాయిని తరలిస్తూ, పట్టుబడిన కేసులో ముగ్గురికి జైలు శిక్ష పడింది. ఢిల్లీకి చెందిన అనిల్‌కుమార్ గుప్త, ఆనోజ్ కుమార్ గుప్త, మనోజ్ కుమార్ మోరియాకు ఐదేళ్ల జైలు, రూ.20 వేల చొప్పున జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం ఒకటో అదనపు జిల్లా జడ్జి ఏవీ రవీంద్రబాబు శుక్రవారం తీర్పు చెప్పారు.
గంజాయి కేసులో ముగ్గురికి జైలు
Published Fri, Sep 9 2016 9:04 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
రాజమహేంద్రవరం లీగల్ :
ఏజెన్సీ ప్రాంతం మీదుగా గంజాయిని తరలిస్తూ, పట్టుబడిన కేసులో ముగ్గురికి జైలు శిక్ష పడింది. ఢిల్లీకి చెందిన అనిల్‌కుమార్ గుప్త, ఆనోజ్ కుమార్ గుప్త, మనోజ్ కుమార్ మోరియాకు ఐదేళ్ల జైలు, రూ.20 వేల చొప్పున జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం ఒకటో అదనపు జిల్లా జడ్జి ఏవీ రవీంద్రబాబు శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ 15న చింతూరు గ్రామంలో ముగ్గురు నిందితులు 52 కిలోల గంజాయిని రవాణా చేస్తూ మోతుగూడెం పోలీసులకు పట్టుబడ్డారు. అప్పటి సీఐ వి.దుర్గారావు కేసు దర్యాప్తు చేశారు. కోర్టు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి వారికి శిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ హసీనా ప్రాసిక్యూషన్ వహించారు.
Advertisement
Advertisement