సాక్షి, హైదరాబాద్: గుట్కాను నిషేధించినా అక్రమార్కుల్లో మాత్రం మార్పు రావడంలేదు. ఎక్కడో ఓ చోట గుట్కా విక్రేతలు పట్టుబడుతూనే ఉన్నారు. పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో అక్రమార్కులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. లారీలో గుట్కాప్యాకెట్లు రవాణా చేస్తే పోలీసులు పట్టుకుంటున్నారని కారులో రవాణా చేస్తున్నారు. శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా గుట్కా ప్యాకెట్లు లభించాయి. వీటి విలువ రూ. 50 లక్షలుంటుందని అంచనా. కర్ణాటక నుంచి 12 వాహనాల్లో గుట్కాను రవాణా చేస్తుండగా పోలీసులు వాహనాల్ని వెంబడించి సీజ్ చేసి, 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment