హైదరాబాద్: నగరంలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న 120 సంచుల సాగర్ గుట్కాను అల్వాల్ పోలీసులు పట్టుకున్నారు. బొల్లారం నుంచి కొంపల్లి వెళ్లే దారిలో ఈ ఘటన జరిగింది. ఆ గుట్కాను పోలీసులు సీజ్ చేశారు. దీని విలువ దాదాపుగా రూ.25 లక్షలు ఉంటుందని ఆల్వాల్ ఎస్సై రమేశ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. గుట్కా తరలిస్తున్న కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్నీ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.