రెండు ఎడ్ల ధర రూ.16.5లక్షలు
- రూ.16.5 లక్షలు పలికిన వృషభాలు
సి.బెళగల్: మండలం పరిధిలోని పోలకల్ గ్రామానికి చెందిన జమ్మన్న, మహేంద్రనాయుడు ఎడ్ల జత ధర రూ.16.5 లక్షలు పలికాయి. గురువారం వీటిని తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా,హుజూర్ నగర్‌కు చెందిన రైతు సుంకి సురేంద్రరెడ్డి కొనుగోలు చేశాడు. ఇటీవల ఈ ఎడ్ల జత మహానంది క్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలో సబ్ జూనియర్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచాయి. అలాగే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన పలు పోటీల్లోనూ బహుమతలు గెలుచుకున్నాయని యజమాని మహేంద్రనాయుడు తెలిపారు. గ్రామానికి పేరు తెచ్చిన ఎడ్లను గురువారం విక్రయించిన సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు.