ధర లేక.. టమాటా పంట కాల్చివేత
రెండెకరాల్లో 7500 కిలోల టమాటా పంట ధ్వంసం
నిన్నటి దాకా సెంచరీ దాటేసి మంట మండించిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. 50 రూపాయలకు 5 కిలోల చొప్పున విక్రయిస్తున్నా డిమాండ్ లేని పరిస్థితి. ఈనేపథ్యంలో టమాట దిగుబడి బాగా వచ్చినా మార్కెట్‌లో సరియైన ధర లభించక పంటను తగుల బెట్టుకుంటున్నాడు రైతన్న.
శివ్వంపేట(నర్సాపూర్): టమాటాకు మార్కెట్‌లో ధర లేకపోవడంతో ఒక రైతు పంటను తగులబెట్టాడు. మండల పరిధి నవాబుపేట గ్రామానికి చెందిన రవిగౌడ్ నాలుగు ఎకరాల్లో టమాటా పంటను సాగు చేస్తున్నాడు. ప్రస్తు తం పొలం నుంచి పంటను సేకరించి మార్కె ట్‌కు తరలిస్తే.. ఒక్కొక్క బాక్స్‌కు రూ.50 మించి ధర రావడం లేదు. రవాణాకు ఒక్కో బాక్స్‌కు రూ.30 పోగా రూ.20 వస్తున్నాయని, కూలీల డబ్బులు సైతం చేతికి అందడం లేదని రైతు వాపోయాడు. దీంతో గురువారం రెండు ఎకరాల్లోని 7500 కిలోల టమాటా పంటను తొలగించి తగులబెట్టాడు.
ఇదే గ్రామంలో 25 మంది రైతులు సుమారు 60 నుంచి 70 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో వీరంతా తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment