![ASI Find Buddhist Caves Madhya Pradesh Bandhavgarh Tiger Reserve - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/9/fafa.jpg.webp?itok=rCfPpef0)
పులుల అభయారణ్యంలో శాంతిబోధను చేసిన బుద్ధుని ఆనవాళ్లు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ పులుల అభయారణ్యంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఇటీవల జరిపిన తవ్వకాల్లో అత్యంత పురాతనమైన బౌద్ధ ఆలయాలు, ఇతర బౌద్ధ చిహ్నాలు బయటపడ్డాయి. ఏఎస్‌ఐ ఈ ప్రాంతంలో 1938 నుంచి తవ్వకాలు సాగిస్తోంది.
దాదాపు 170 చదరపు కిలోమీటర్ల పరిధిలో సాగిస్తున్న తవ్వకాల్లో ఇటీవల బౌద్ధ ఆలయాలు ఇవి. ఈ ప్రాంతంలో ఏఎస్‌ఐ జరిపిన తవ్వకాల్లో ఇప్పటి వరకు 26 ఆలయాలు, 26 గుహలు, రెండు స్థూపాలు, రెండు బౌద్ధారామాలు, 46 శిల్పాలు, 24 శిలాశాసనాలు బయటపడ్డాయి. ఇవన్నీ క్రీస్తుశకం ఐదో శతాబ్దానికి చెందినవని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
చదవండి: ఏడు ఖండాలు కాదు ఏక ఖండమే..!
Comments
Please login to add a commentAdd a comment