buddist
-
బౌద్ధ సన్యాసి ముసుగులో భారత్‌లో గూఢచర్యం?
దేశ రాజధానిలో గూఢచర్య కలకలం రేగింది. బౌద్ధ సన్యాసి వేషంలో ఉన్న ఓ మహిళను చైనా పౌరురాలిగా నిర్ధారించుకున్న ఢిల్లీ పోలీసులు.. పలు అభియోగాల కింద ఆమెను అరెస్ట్ చేశారు. మూడేళ్లుగా భారత్‌లో ఉంటున్న ఆమె.. కీలక సమాచారం ఏమైనా చైనాకు చేరవేసిందా? ఏదైనా కుట్రకు తెర తీసిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ ఉత్తరంగా ఉన్న టిబెట్ శరణార్థి శిబిరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూఢచర్యానికి పాల్పడిందనే అనుమానంతో పాటు చోరీలకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే అనుమానంతోనూ ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నేపాల్ రాజధాని ఖాట్మాండుకు చెందిన డోల్మా లామా అనే బౌద్ధ సన్యాసి.. టిబెట్ శరణార్థి కాలనీలోని మంజు కా టిల్లాలో ఉంటున్నాడు. అయితే అతను అతను కాదని.. ఆమె అని పోలీసులు వెల్లడించారు. చైనాకు చెందిన కాయ్ రువో(30).. బౌద్ధ సన్యాసి వేషంలో ఇక్కడికి వచ్చినట్లు తేల్చారు. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సేకరించిన ఆధారాలతో అతన్ని.. ఆమెగా ప్రకటించారు పోలీసులు. చైనీస్ పాస్‌పోర్ట్‌తో 2019లో భారత్‌లోకి కాయ్ రువో ప్రవేశించిందని ప్రకటించారు. ఇంగ్లీష్‌తో పాటు మాండరిన్, నేపాలీ భాషలను ఆమె మాట్లాడుతోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆమెను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. అయితే.. చైనా కమ్యూనిస్ట్ నేతలు కొందరు తనను చంపే యత్నం చేస్తున్నారని.. తప్పించుకునేందుకు ఇలా వేషం కట్టినట్లు ఆమె ప్రాథమికంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు ఆమెను క్షుణ్ణంగా విచారించాలని నిర్ణయించుకున్నారు. ఇదీ చదవండి: ఎవరూ ఎత్తుకెళ్లలే.. గ్యాంగ్ రేప్ చేయలే!! -
1938 నుంచి తవ్వకాలు.. ఎట్టకేలకు బయటికి
పులుల అభయారణ్యంలో శాంతిబోధను చేసిన బుద్ధుని ఆనవాళ్లు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ పులుల అభయారణ్యంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఇటీవల జరిపిన తవ్వకాల్లో అత్యంత పురాతనమైన బౌద్ధ ఆలయాలు, ఇతర బౌద్ధ చిహ్నాలు బయటపడ్డాయి. ఏఎస్ఐ ఈ ప్రాంతంలో 1938 నుంచి తవ్వకాలు సాగిస్తోంది. దాదాపు 170 చదరపు కిలోమీటర్ల పరిధిలో సాగిస్తున్న తవ్వకాల్లో ఇటీవల బౌద్ధ ఆలయాలు ఇవి. ఈ ప్రాంతంలో ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో ఇప్పటి వరకు 26 ఆలయాలు, 26 గుహలు, రెండు స్థూపాలు, రెండు బౌద్ధారామాలు, 46 శిల్పాలు, 24 శిలాశాసనాలు బయటపడ్డాయి. ఇవన్నీ క్రీస్తుశకం ఐదో శతాబ్దానికి చెందినవని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. చదవండి: ఏడు ఖండాలు కాదు ఏక ఖండమే..! -
ఏనుగుల అందాల పోటీల్లో అపశ్రుతి
-
చదువు పేరిట బాలురతో...
పట్నా : బిహార్‌లోని బౌద్ధగయలో వెలుగుచూసిన ‘బాలురపై టీచర్ కీచక చర్య’లో కొత్తకోణం వెలుగుచూసింది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపుర నుంచి పేద కుటుంబాలకు చెందిన పిల్లలను చదువు పేరుతో తీసుకొచ్చి సెక్స్ వర్కర్లుగా పనిచేయిస్తున్నారని ఎస్పీ రమణ్‌కుమార్ చౌదురి నేతృత్వంలో ఏర్పాటైన సిట్ విచారణలో వెల్లడైంది. ప్రజ్ఞా జ్యోతి బుద్దిస్ట్ స్కూల్ అండ్ మెడిటేషన్ సెంటర్ పేరుతో బౌద్ధ సన్యాసి భంతే సంఘపియే సుజోయ్ నిర్వహిస్తున్న విద్యాలయం అసభ్య కార్యకలాపాలకు అడ్డాగా మారిందని సిట్ అధికారులు వెల్లడించారు. ప్రజ్ఞా జ్యోతి బుద్దిస్ట్ స్కూల్ అండ్ మెడిటేషన్ సెంటర్లో చదువుతున్న 15 మంది బాలురపై టీచర్ లైంగిక దాడికి యత్నించాడని ఆరోపణలు రావడంతో పోలీసులు బుధవారం ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల పోలీసు కస్టడీ విధించింది. కాగా, బాధిత విద్యార్థులను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చదువు చెప్పిస్తామని చెప్పి పేద పిల్లలను గయకు తరలించిన అనంతరం వారిపై లైంగిక, భౌతిక దాడులకు దిగినట్టు అధికారులు తెలిపారు. పిల్లలను సెక్స్‌వర్కర్లుగా కోల్‌కత వంటి నగరాలకు పంపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. పిల్లలతో మఠంలో రాత్రుళ్లు నగ్నంగా డ్యాన్సులు కూడా చేయించినట్టు విచారణలో వెల్లడైందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై అంతర్జాతీయ బుద్ధిస్ట్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. బౌద్ధ మతాన్ని భ్రష్టు పట్టించే ఇలాంటి చర్యలకు పూనుకున్నవారికి కఠిన శిక్ష పడాలని స్పష్టం చేసింది. కేసు విచారణకు పోలీసులకు పూర్తి మద్ధతు తెలుపుతున్నట్టు వెల్లడించింది. గయలో ఉన్న 160 మఠాలపై కార్యాకలాపాలపై ఇక నుంచి నిఘా వేస్తామని తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. మా పిల్లలకు చదువు చెప్తాం అని చెప్పి గయలోని బుద్దిస్ట్ స్కూల్ సన్యాసులు మమ్మల్ని కోరారు. ఒక్కో పిల్లాడికి వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకెళ్లార’ని తెలిపారు. -
బాలురపై టీచర్ కీచక చర్య..!
పట్నా : విద్యాబుద్ధులు చెప్తానని సుద్దులు పలికిన ఓ బౌద్ధ సన్యాసి తన స్కూల్లో చదువుతున్న విద్యార్థులపట్ల అసభ్యంగా ప్తవర్తించాడు. వారిపై లైంగిక దాడికి దిగడంతోపాటు గొడ్డును బాదినట్టు బాదాడు. ఈ ఘటన బౌద్ధగయలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. ‘ప్రజ్ఞా జ్యోతి బుద్ధిస్ట్ అండ్ మెడిటేషన్ సెంటర్’ పేరుతో బౌద్ధగయలోని మస్తీపూర్‌లో ఓ బౌద్ద సన్యాసి పాఠశాల నిర్వహిస్తున్నాడు. అస్సాం రాష్ట్రానికి చెందిన 15 మంది బాలురు అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. స్కూల్లో టీచర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 15 మంది విద్యార్థులు ఆరోపించారు. తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించారు. కాగా, నిందితున్ని కస్టడీలోకి తీసుకున్నామని గయ ఎస్పీ రాజ్‌కుమార్ షా వెల్లడించారు. బిహార్‌లో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వంపై ఓవైపు ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండగా.. ఈ ఘటన జరగడం విశేషం. బిహర్‌లోని ముజఫర్‌పూర్‌లో షెల్టర్ హోం నిర్వహణ పేరుతో బాలికలపై లైంగిక దాడులు జరిగిన విషయం కొన్ని నెలల కిందట బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 24 మంది బాలికలు లైంగిక దాడికి గురైనట్టు వెల్లడైంది. -
బౌద్ధ బిక్షవు విగ్రహం లభ్యం
ఆసక్తిగా తిలకించి, పూజలు చేసిన ప్రజలు యానాం టౌన్ : యానాం శివారు సావిత్రినగర్ ప్రాంతంలో సముద్రపు మొగ వద్ద యానాంకు సంబంధించిన దీవి ఒడ్డున ఒక విగ్రహం లభ్యమైంది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ విగ్రహాన్ని గుర్తించారు. వెదురుగెడలతో పెద్ద తెప్పలా కట్టి ఉంది. దానిపై గోపురంలా ఉన్న పందిరిలో బిక్షాపాత్రలో చెయ్యిపెట్టినట్టుగా ఉంది. గోపురం పూర్తిగా అలంకరించి, యుకే మిల్క్ పేరుతో ఉన్న డబ్బాలు తెప్పకు తీగలతో కట్టి ఉన్నాయి. ఏదో విగ్రహం సముద్రంలో కొట్టుకు వచ్చిందన్న విషయం తెలుసుకున్న సావిత్రినగర్, గిరియాంపేట తదితర గ్రామాలకు చెందిన ప్రజలు, మహిళలు, యువకులు, పిల్లలు నావలపై అధికసంఖ్యలో తరలి వెళ్లి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. దైవ విగ్రహంగా భావించి, మహిళలు, తదితరులు కొబ్బరికాయులు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ విషయం మత్స్యకార గ్రామాలలో చర్చనీయాంశంగా మారింది. సముద్రపు ఒడ్డున గుర్తించిన ఈ విగ్రహం ఒక బౌద్ధ బిక్షవు (మాంక్ ఇన్ బుద్ధిస్ట్)విగ్రహంగా తెలుస్తోంది. బౌద్ధ బిక్షవు మాదిరిగా బిక్షాపాత్రతో ఉంది. సింగపూర్, మలేషియా దేశాలకు చెందిన బౌద్ధబిక్షవుకు సంబంధించిన విగ్రహంగా భావిస్తున్నారు. సముద్రంలో కొట్టుకువచ్చి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. విగ్రహం ఉన్న గోపురం ««థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్ దేశాలలో బుద్ధుని ఆలయాల తరహాలో ఉంది.