తవ్వకాల్లో గుట్టలు గుట్టలుగా గవ్వలు.. | Shellgrits Found In Orissa | Sakshi
Sakshi News home page

తవ్వకాల్లో గుట్టలు గుట్టలుగా గవ్వలు..

Published Mon, Feb 15 2021 1:29 PM | Last Updated on Mon, Feb 15 2021 2:26 PM

Shellgrits Found In Orissa - Sakshi

తవ్వకాల్లో బయటపడిన గవ్వలను చూపిస్తున్న కూలీలు 

భువనేశ్వర్‌: నయాగడ్‌ జిల్లాలోని తరియా పంచాయతీలో ఉన్న నిచ్చిపూర్‌ గ్రామంలో కొత్త ఇల్లు నిర్మాణం నిమిత్తం పునాదులు తీసేందుకు తవ్వకాలు చేపడుతుండగా అక్కడి భూగర్భంలో నుంచి గుట్టలు గుట్టలుగా గవ్వలు బయటపడ్డాయి. మొత్తం 10 తట్టల గవ్వలు వెలికి తీసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సంఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం రేకిత్తిస్తుండగా, పూర్వీకులు వీటిని గుప్త నిధిగా భావించి భూగర్భంలో పదిలపరిచినట్లు స్థానికులు భావిస్తున్నారు. పూర్వ కాలంలో దైనందిన లావాదేవీల్లో నేటి తరంలో వినియోగించే ధనం తరహాలోనే ఈ గవ్వలను వినియోగించే వారనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కేవలం 4 అడుగులు లోపు జరిపిన తవ్వకాల్లోనే ఈ గవ్వలు కనిపించాయని ఇంటి స్థల యజమాని నారాయణ సాహు తెలిపాడు.

చదవండి: ఒమర్‌ అబ్దుల్లా కుటుంబం గృహనిర్బంధం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement