
మూత్ర విసర్జన చేస్తుంటే.. తుపాకీతో కాల్చాడు
భువనేశ్వర్: ఆసుపత్రి ముందు మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ఓ డాక్టర్ కాల్చిన సంఘటన ఆదివారం ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తే.. దారిన వెళ్తున్న ఓ వ్యక్తి ఆసుపత్రి ముందు మూత్ర విసర్జన చేశాడు. ఇది తట్టుకోలేని ఆసుపత్రి డాక్టర్ రివాల్వర్ తో అతని ఎడమకాలు మోకాలి కింద కాల్చాడు.
బుల్లెట్ తగలడంతో వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు డాక్టర్ ను అరెస్టు చేసి రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు.