
భువనేశ్వర్ : మహిళ గొంతుకోసి మెడలో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలు కుభికొట పంచాయతీ పరిధి హులకాతుండ గ్రామానికి చెందిన బిజయ్ హులుకా భార్య కొసాయి హులుకా(29)గా పొలీసులు వెల్లడించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బిజయ్ తన సొంత పనిమీద శుక్రవారం రాయగడకు వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి అదే రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగుల్లో తన భార్యపడి ఉండటం గమనించి, కేకలు వేశాడు.
చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూసేసరికి మృతురాలి గొంతు కోసి ఉండటం గమనించారు. ఆమె ధరించిన బంగారు ఆభరణాలు కనిపించకపోగా.. ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరిచి ఉండటంతో వెంటనే కుంభికోట పొలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం అక్కడికి చేరుకున్న రాయగడ పోలీసులు.. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment