భువనేశ్వర్‌లో జాతీయ స్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో జాతీయ స్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు.
– స్టాళ్ల ఏర్పాటునకు దరఖాస్తుల ఆహ్వానం
– పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో జాతీయ స్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. బుధవారం ఆయన తన చాంబరులో ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన బ్రోచర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని తూర్పు భారత ఫిలాటలిస్ట్ అసోసియేషన్ వారు తపాలా శాఖ సహకారంతో 30.9.16 నుంచి 2.10.16వ తేదీ వరకు ( మూడు రోజుల పాటు) నిర్వహిస్తారన్నారు. ఉత్తమంగా ఎంపికైన స్టాళ్లకు బహుమతులు ఉంటాయని తెలిపారు. వయస్సు 11 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న వారిని యూత్ కేటగిరీ, 19 ఏళ్లు ఆపైన వయస్సు కలిగిన వారిని సీనియర్ కేటగిరీగా పరిగణిస్తామన్నారు. సీనియర్ కేటగిరీ వారు ఒక్కో ఫ్రేమ్‌కు రూ. 200 రుసుం చెల్లించాల్సి ఉంటుందని, యూత్ కేటగిరీకి ఉచితమని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు రెండు దరఖాస్తు ఫారాల ప్రతులను ‘ఆర్గనైజింగ్ సెక్రటరీ, నేచరెపెక్స్–2016, సి–6, ఐఆర్‌సీ విలేజ్, భువనేశ్వర్ – 751 015.’ చిరునామాకు 12.8.16వ తేదీ లోపు పంపించుకోవాలని వివరించారు. మరిన్ని వివరాలకు కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సి.హెచ్.శ్రీనివాస్, పోస్టుమాస్టర్ వై.డేవిడ్, స్టాంప్స్ ట్రెజరర్ నాగవెంకటేశ్వర్లు, ఫిలాటెలీ విభాగపు ఉద్యోగినులు లలిత, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.