వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకున్నారు. భువనేశ్వర్ లోని విమానాశ్రయంలో వైఎస్ జగన్ కు స్థానిక తెలుగువారు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్తో ఆయన క్యాంప్ కార్యాలయంలో జగన్ భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజభనపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ మద్దతు కూడగడుతున్నారు. అందులోభాగంగా బీజు జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయిక్ను కలవనున్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల రాష్ట్రానికి జరగుతున్న అన్యాయాన్ని జగన్ ఈ సందర్బంగా నవీన్ పట్నాయిక్కు వివరించనున్నారు. అంధ్రప్రదేశ్ విభజన వల్ల ఏర్పడే నష్టాలను వైఎస్ జగన్ శనివారం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, శరద్ యాదవ్కు న్యూఢిల్లీలో విశదీకరించిన సంగతి తెలిసిందే.