భువనేశ్వర్ రైల్వేస్టేషన్
భువనేశ్వర్ : భారతీయ రైల్వే జాతీయ స్థాయిలో పరిశుభ్ర రైల్వే స్టేషన్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది. మొదటి 10 ఉత్తమ పరిశుభ్ర రైల్వేస్టేషన్‌ల జాబితాలో భువనేశ్వర్‌కు స్థానం లభించింది. రైల్వేశాఖ రెండేళ్ల నుంచి ఉత్తమ పరిశుభ్ర రైల్వేస్టేషన్‌లను ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. భారత నాణ్యతా మండలి(క్యూసీఐ) ఏటా ఈ జాబితాను విడుదల చేస్తుండడం విశేషం.
- ఎ–1 విభాగంలో జోధ్‌పూర్, జైపూర్, తిరుపతి మొదటి 3 స్థానాల్లో ఉత్తమ పరిశుభ్ర రైల్వేస్టేషన్లగా నిలిచాయి.
- ఎ–విభాగంలో మార్వార్, ఫులేరా, వరంగల్ మొదటి 3 స్థానాల్లో నిలిచాయి.
- ఎ–1 విభాగంలో భువనేశ్వర్ రైల్వేస్టేషన్ తొమ్మిదో స్థానంలో నిలిచింది.
- ఎ–1 విభాగంలో ఉత్తమ పరిశుభ్రత స్టేషన్ల జాబితాలో ఈస్టుకోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం స్టేషన్ భువనేశ్వర్‌కు 9వ స్థానం
- ఎ–1 విభాగంలో పూరీ రైల్వేస్టేషన్ 37వ స్థానం నుంచి 22వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
- ఎ– విభాగం జాబితాలో కటక్ రైల్వేస్టేషన్‌కు 30వ స్థానం లభించింది.
గతేడాది కటక్ రైల్వేస్టేషన్‌కు 100వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.జాతీయ స్థాయిలో 10 జోన్‌లు పరిశుభ్రత విషయంలో 10 నుంచి 20 శాతం పుంజుకోవడం విశేషం. 4 రైల్వేజోన్ పరిశుభ్రతలో 20 శాతం పుంజుకుంది. వాయువ్య రైల్వే ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలవగా దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్ రైల్వే తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి.
ఎ–1 విభాగంలోని తొలి పది..
ఎ–1 విభాగంలో మొదటి 10 ఉత్తమ పరిశుభ్ర రైల్వేస్టేషన్‌ల జాబితాలో జోద్‌పూర్, జైపూర్, తిరుపతి, విజయవాడ, ఆనంద విహార్ టెర్మినల్, సికింద్రాబాద్ జంక్షన్, బంద్రా, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్టణం ఉన్నాయి. ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో పలాస (20), బరంపురం (35), జాజ్‌పూర్–కెంజొహర్ రోడ్ (39), రాయగడ (64), ఖుర్దా (127), భద్రక్ (160), సంబల్‌పూర్ (239) ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment