ఒడిశా : లోయలోకి దూసుకెళ్లిన బస్సు | Bus Rolled Over In Odissa | Sakshi
Sakshi News home page

లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 25 మందికి గాయాలు

Published Fri, Dec 18 2020 8:40 AM | Last Updated on Fri, Dec 18 2020 8:46 AM

Bus Rolled Over In Odissa - Sakshi

భువనేశ్వర్‌ : ఒడిశాలో ప్రమాదవశాత్తూ శుక్రవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్‌ బస్సు లోయలో పడిపోయింది. కందమాల్‌ జిల్లా గడియపొడ ఘాట్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని.. వీరిలో 25 మంది గాయపడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.పుల్‌వాని నుంచి భువనేశ్వర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement