సాక్షి, భువనేశ్వర్ : బీజేపీ - బీజేడీల మధ్య ఇక పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. ఈ సారి లోక్‌సభ ఎన్నికలకు 15 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ ఒక్కటవ్వనున్నారని అందరూ అనుకున్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు అందుకు తావు ఇవ్వడం లేదని సమాచారం.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. ఆ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేడీ అధినేత, ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌లు మంతనాలు జరిపారు. అనంతరం 15 ఏళ్ల తర్వాత బీజేపీతో జతకట్టేలా సంకేతాలిచ్చారు.
అమిత్ షా తో సుదీర్ఘంగా చర్చలు
ఇందులో భాగంగా పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల బరిలో దిగేలా ఇరు పార్టీల అగ్రనేతలు చర్చలు జరిపారు. అయితే, సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో.. బీజేపీ ఒంటరిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ప్రకటించారు. పొత్తుపై చర్చించేందుకు అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన మన్మోహన్ సాముల్.. కేంద్రమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
చర్చల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొత్తులపై మన్మోహన్ సాముల్ మాట్లాడుతూ.. ‘మా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ ఏది చెబితే అది తుది నిర్ణయం’ అని అన్నారు.
సీనియర్ నేతలతో సీఎం భేటీ
ఆ తర్వాతే ఒడిశాలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఎక్స్.కామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. మరోవైపు బీజేడీ పార్టీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్ తన నివాసంలో పార్టీ సీనియర్ నేతల సమావేశాన్ని నిర్వహించారు.
ఇలా వరుస పరిణామాలతో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రసకందాయంగా మారాయి. పోలింగ్‌కు సమయం ఉంది కాబట్టి పొత్తులపై బీజేపీ- బీజేడీలు చర్చలు జరుపుతుంటే.. ఇరు పార్టీల నేతలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment