కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్ : దేశంలో గుణాత్మక మార్పుకోసం జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫెడరల్ ఫ్రంట్‌లో చేరే పార్టీలు, ఆ పార్టీ అధినేతలతో దశలవారీగా భేటీ కావడానికి ఇప్పటికే సీఎం రూట్‌మ్యాప్ రూపొందించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవేగౌడలతో కేసీఆర్ భేటీ అయి ప్రస్తుత రాజకీయాలు, జాతీయ స్థాయిలో పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.
తాజాగా కేసీఆర్ ఒడిశాలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో ఆయన సమావేశం కానున్నారు. ఒడిశాలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో మే మొదటి వారంలో నవీన్ పట్నాయక్‌తో భేటీ కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment