భువనేశ్వర్: దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రంట్ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు వెల్లడించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. త్వరలో నవీన్ పట్నాయక్‌ను మళ్లీ కలుస్తానని తెలిపారు.
నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. తామిద్దరం రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై చర్చించినట్టు తెలిపారు. భావ సారూప్య పార్టీలతో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించిననట్టు పేర్కొన్నారు. అంతకుముందు భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్ నేరుగా నవీన్ పట్నాయక్ ఇంటికి వెళ్లారు. అక్కడ నవీన్ పట్నాయక్ కేసీఆర్‌కు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment