
భువనేశ్వర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం భువనేశ్వర్ చేరుకున్నారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. మరికాసేపట్లో ఆయన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇరువురు నాయకులు చర్చించనున్నారు. ఈ రోజు రాత్రి కేసీఆర్ నవీన్ పట్నాయక్ అధికార నివాసంలో కేసీఆర్ బస చేయనున్నారు. సోమవారం ఒడిశాలోని కోణార్క్, పూరీ దేవాలయాలను కేసీఆర్ సందర్శించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం కేసీఆర్ కోల్‌కతా వెళ్లనున్నారు.
ఆదివారం ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖ చేరుకున్న కేసీఆర్ దంపతులు.. నేరుగా శారదాపీఠానికి బయలుదేరారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. సీఎం హోదాలో తొలిసారి విశాఖపట్నం వచ్చిన కేసీఆర్.. శారదా పీఠాన్ని సందర్శించి.. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతితో అర్ధగంట పాటు భేటీ అయిన కేసీఆర్ తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment