తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకు వేయనున్నారు. కొత్త కూటమికి నిశ్చయించుకున్న కేసీఆర్ ఇందులో భాగంగా ఆదివారం చెన్నై వెళ్లి డీఎంకే నేతలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు డీఎంకే నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో భేటీ అవుతారు. అనంతరం రెండు గంటలకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ వంటి కీలక నేతలతో ఫెడరల్ ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. డీఎంకే నేతలతో ఆదివారం మధ్యాహ్నం సమావేశం అవనున్న కేసీఆర్.. సాయంత్రం తమిళనాడుకు చెందిన మరికొందరు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రానున్నారు. అదే విధంగా వచ్చే వారం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ రానున్నారు. ఫ్రంట్‌పై అఖిలేశ్, కేసీఆర్ చర్చించనున్నారు. ఆ తర్వాత ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో కొత్త ఫ్రంట్‌పై చర్చిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment