ఏవోబీలో కాల్పులు.. మావోయిస్టు మృతి
Published Wed, Apr 12 2017 10:38 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM
ఒడిశా: భద్రాతాబలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందడంతో పాటు ఓ గిరిజనుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని నారాయణపట్నం లల్లేరి అటవీప్రాంతంలో బుధవారం ఉదయం ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలపై మావోలు కాల్పులు జరపడంతో.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందగా, ఓ గిరిజనుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన గిరజనుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు.
Advertisement
Advertisement