ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదాన్ని ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు. ప్రమాదంలో కొందరు ఇంటిలోనివారిని కోల్పోగా, మరికొందరు క్షతగాత్రులుగా మిగిలారు. దీనికి భిన్నంగా కొందరు విచిత్ర పరిస్థితుల్లో ప్రాణాలతో బతికి బయటపడ్డారు. అటువంటి కథనం ఒకటి వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే తన 8 ఏళ్ల కుమార్తెతో పాటు ఒక తండ్రి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కటక్ వెళ్లేందుకు బయలుదేరారు. వారు కరగ్‌పూర్‌లో రైలు ఎక్కారు.
వారికి థర్డ్ ఏసీలో సీటు రిజర్వ్ అయ్యింది. అయితే వారికి కిటికీ దగ్గరి సీటు లభ్యం కాలేదు. అయితే కుమార్తె తనకు కిటికీ దగ్గరి సీటు కావాలని మొండిపట్టు పట్టింది. తండ్రి ఎంత నచ్చజెప్పినా ఆ చిన్నారి మాట వినలేదు. దీంతో ఆ తండ్రి టీసీని సంప్రదించి, కిటికీ దగ్గరి సీటు కావాలని రిక్వస్ట్ చేశారు. దీనికి టీసీ సమాధానమిస్తూ మీరు మరో ప్రయాణికుని అడిగి వారి సీటు అడ్జెస్ట్ చేసుకోండని సలహా ఇచ్చారు. దీంతో ఆ తండ్రి మరో కోచ్‌లోని ఇద్దరు ప్రయాణికులను రిక్వస్ట్ చేయడంతో వారు అందుకు అంగీకరించారు. దీంతో ఆ తండ్రీకుమారులు ఆ రెండు సీట్లలో కూర్చున్నారు.
కొద్దిసేపటికి వారు ప్రయాణిస్తున్న రైలు బాలాసోర్ చేరుకున్నంతలోనే ప్రమాదానికి గురయ్యింది. ఆ తండ్రీకూతుర్లు కూర్చున్న కోచ్‌కు ఈ ప్రమాదంలో ఏమీకాలేదు. అయితే అంతకుమందు వారికి కేటాయించిన సీట్లు కలిగిన బోగీ తునాతునకలైపోయింది. ఆ బోగీలోని చాలామంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం బారి నుంచి బయటపడిన ఆ తండ్రి పేరు ఎంకే దేవ్. అయిన మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె మొండితనం వలనే ఈరోజు తాము ప్రాణాలతో బయటపడగలిగామన్నారు. కాగా అతని కుమార్తె చేతికి స్వల్పగాయమయ్యింది. ఆ చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది.
చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: ‘ ట్రైన్ టాయిలెట్‌లో ఉన్నాను... ఒక్క కుదుపుతో..’
Comments
Please login to add a commentAdd a comment