ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికిగల కారణాలు దర్యాప్తు రిపోర్టు వచ్చిన తరువాత వెల్లడికానున్నాయి. అయితే ఈ విషయమై ఒక అధికారి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖలో ఆ రైల్వే అధికారి రాబోయే ప్రమాదాన్ని 3 నెలల ముందుగానే ఊహించి, ఉన్నతాధికారులకు తెలియజేశారు. సిగ్నల్ సిస్టమ్‌లోని లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. హరిశంకర్ వర్మ అనే ఈ రైల్వే అధికారి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విధులు నిర్వహిస్తున్నారు. దీనికి ముందు ఆయన పశ్చిమ మధ్య రైల్వేలో పనిచేశారు. అప్పుడు ఆయన ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో దక్షిణ పశ్చిమ రైల్వేలో రైలు మరో లైనులో వెళ్లిన ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్‌లాకింగ్ కోసం తయారు చేసిన సిస్టమ్‌ను బైపాస్‌గా మార్చినపుడు లొకేషన్ బాక్సులో జరిగిన గడబిడ గురించి ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిని తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ఆయన రైల్వే బోర్డుకు తెలియజేశారు. అలాగే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కూడా పేర్కొన్నారు. ఈ సిస్టమ్‌లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, రైలు బయలుదేరిన తరువాత డిస్పాచ్ రూట్ మారిపోతున్నదని పేర్కొన్నారు. సిగ్నల్‌కు సంబంధించిన కీలకమైన పనులు కింది ఉద్యోగుల చేతుల్లో ఉన్నాయని, దీనివలన అనుకోని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ప్రస్తుతం జరిగిన ప్రమాదం విషయానికి వస్తే రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రైన్ నంబర్12481 కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బహన్‌గా బాజార్ స్టేషన్‌కు చెందిన మెయిన్ లైన్‌లోవెళుతోంది. ఇంతలో అది పట్టాలు తప్పి లూప్‌లైన్‌లో నిలిచివున్న గూడ్సు రైలును ఢీకొంది. ఆ సమయంలో రైలు ఫుల్ స్పీడులో ఉంది. ఫలితంగా ఆ రైలుకు సంబంధించిన 21 కోచ్‌లు పట్టాలు తప్పాయి. మూడు కోచ్‌లు డౌన్‌లైన్‌లోకి చేరుకున్నాయి. నిజానికి బహన్‌గా బాజార్ స్టేషన్‌లో ఈ ట్రైన్‌కు స్టాపేజీ లేదు.
అందుకే ఈ రైలు స్పీడుగా వెళ్లి గూడ్సును ఢీకొన్నప్పుడు దాని మూడు కోచ్‌లో డౌన్‌లైన్‌లోకి చేరుకోగా.. అటువైపుగా వస్తున్న యశ్వంత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు పట్టాలపై ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొన్నాయి. ఈ ప్రమాదం భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌కు సుమారు 171 కిలోమీటర్లు, ఖగర్‌పూర్ రైల్వేస్టేషన్‌కు సుమారు 166 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ జిల్లాలోని బహన్‌గా బాజార్ స్టేషన్ వద్ద జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment