
సాక్షి, భువనేశ్వర్ : మానవీయ దృక్పథం వాస్తవ కార్యాచరణను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యక్షంగా ప్రతిబింబింపజేశారు. అధికారిక కార్యక్రమాలు ముగించుకుని, ఆదివారం సాయంత్రం తన ఇంటికి వెళ్తున్న ముఖ్యమంత్రికి అదే దారిలో అంబులెన్స్ సైరన్ వినిపించింది. దీంతో అప్రమత్తమైన ఆయన కాన్వాయ్‌ను నిలపాలని, ఆ అంబులెన్స్ వెళ్లిన తర్వాత కాన్వాయ్ ముందుకు పోవాలని ఆదేశించారు. ఈ సంఘటనను చూసిన అక్కడి ప్రజలు ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
(ఎన్‌ఆర్‌సీపై నవీన్ పట్నాయక్ కీలక వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment