పొలిమేరలో ఉన్న సమీప బంధువు ఇంటికి తీసుకెళ్లి.. | Husband Brutually Assasinates Wife In Orissa | Sakshi
Sakshi News home page

పొలిమేరలో ఉన్న సమీప బంధువు ఇంటికి తీసుకెళ్లి..

Published Tue, Mar 16 2021 8:00 AM | Last Updated on Tue, Mar 16 2021 9:07 AM

Husband Brutually Assasinates Wife In Orissa - Sakshi

తననే నమ్ముకొని ఏడడుగులు వేసి ... మూడు ముళ్లు వేయించుకొని కోటి ఆశలతో పుట్టినింటిని వీడి అత్తవారింట అడుగు పెట్టింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే భార్యను కిరాతకంగా కొట్టి ... పీక నులిమి హత్య చేశాడు. తప్పించుకుందామని పరారైన నిందితులు ఎట్టకేలకు చట్టం చేతికి చిక్కారు. 

రామభద్రపురం: భార్యను హత్య చేసి పరారైన నిందితుడు ఎట్టకేలకు అరెస్టయ్యాడు. మండలంలోని రావివలస పంచాయతీ పరిధిలోని మూలసెగాం గ్రామానికి చెందిన ఎన్నికల ఎర్రమ్మ (30)ను భర్త పెంటయ్య గత నెలలో హత్య చేసి కొండల్లోని లోయల్లో పడేసి పరారైన సంఘటన తెలిసిందే. ఎట్టకేలకు ఈ కేసును పోలీసులు ఛేదించి సోమవారం నిందితుడితోపాటు అతనికి సహకరించిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలు ప్రకారం... నిందితుడు పెంటయ్య ఫిబ్రవరి 23న అతని చెల్లి ఇంటికి పాచిపెంట మండలం కొండతాడూరు వెళదామని మాయమాటలు చెప్పి బయలు దేరించాడు. మార్గమధ్యలో పాచిపెంట మండలం శీతం గ్రామం వద్ద ఇద్దరూ గొడవ పడ్డారు. ఎర్రమ్మను బాగా కొట్టడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఈమెను పొలిమేరల్లో ఉన్న దూరపు బంధువైన వి.సోమయ్య ఇంటికి తీసుకెళ్లాడు.

వారింట్లో గత నెల 24,25 తేదీల్లో ఉన్నారు. అయినా భార్య సరిగా కోలుకోలేదు. కోలుకున్న తరువాత కొట్టిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులతో ఎక్కడ చెబుతుందోనన్న భయంతో 26వ తేదీన పీక నులిమి చంపేశాడు. మృత దేహాన్ని సోమయ్య సహాయంతో భర్త పెంటయ్య కట్టిన డోలీలో పెదసెలగాం పరిసరాల్లో దిబ్బగుడ్డి వద్ద కొండ లోయల్లో పడేసి పరారయ్యారు. పరారైన వారిని ఎట్టకేలకు సోమవారం అదుపులోకి తీసుకొని సీఐ అప్పలనాయుడు, ఎస్‌.కృష్ణమూర్తిలు సాలూరు కోర్టుకు తీసుకువెళ్లారు.
చదవండి:
ఫోన్‌కు ఓటీపీలు వస్తాయి చెప్పమ్మా అంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement