
విజయనగరం: స్నానం చేసేందుకు నదిలోకి దిగిన ముగ్గురు కుటుంబ సభ్యుల్లో తల్లి మృతిచెందగా కుమారుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఒరిస్సా రాయగడ మజ్జిగౌరీ అలయం వద్ద జరిగింది. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన శాంతి అనే మహిళ తన కుమార్తె ఇందు, కుమారుడు అఖిల్‌తో కలిసి స్నానం చేసేందుకు నాగావళి నదికి వెళ్లింది. నీట మునిగి శాంతి మృతిచెందగా అఖిల్ గల్లంతయ్యాడు. ఇందు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అఖిల్ కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment