కొరాపుట్: ఎక్కడైనా ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించడం సర్వసాధారణం. కానీ గతంలో ఒక అసెంబ్లీ స్థానానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం ఒడిశా అసెంబ్లీ రికార్డుల్లో సైతం నమోదై ఉంది. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే ఈ నిబంధన ఉండేదని తెలుస్తోంది. బలహీన వర్గాలకు చేయూతనివ్వడానికి ఒక నియోజకవర్గంలో ఒక జనరల్ కేటగిరి ఎమ్మెల్యేతో పాటు ఒక రిజర్వ్ కేటగిరి ఎమ్మెల్యే ఉండేవారు.
నబరంగ్‌పూర్ విధానసభ స్థానం నుంచి 1951లో కాంగ్రెస్ పార్టీ తరుపున జనరల్ కేటగిరి కింద సదాశివ త్రిపాఠి, రిజర్వ్ కేటగిరిలో ముది నాయక్ ప్రాతినిధ్యం వహించారు. 1957లో ఇదే స్థానం నుంచి అదే పార్టీకి చెందిన సదాశివ త్రిపాఠితో పాటు రిజర్వ్ కేటగిరిలో మిరు హరిజన్ కొనసాగారు.
ఈ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది. జయపూర్, ఉదయగిరి, అనుగుల్, పాల్ లక్రా కే నగర్, డెంకనాల్, భవానీపట్న, జునాగఢ్, నువాపడా, టిట్లాగఢ్, పాట్నగఢ్, బొలంగీర్, పదంపూర్, సోహేలా, రైరాకోల్, జర్సుగుడ, బెమ్రా, సుందర్ గఢ్, కెంజోర్, ఆనంద్‌పూర్, పంచ్‌పిర్, బరిపద, నిలగిరి, చందబలి, సుకింద, జాజ్‌పూర్, బింజాపూర్, అవౌల్, సాలేపూర్, కటక్ రూరల్, నిమాపరా, భువనేశ్వర్, నయాగడ్, కేంద్రపడా, దసపల్లా, అస్కా, బ్రహ్మపుర, పర్లాకిమిడి స్థానాల్లో సైతం ఇద్దరేసి ఎమ్మెల్యేలు ఉండేవారు.
Comments
Please login to add a commentAdd a comment